- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘విడాకులు లేని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా’.. హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్
దిశ, సినిమా: ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లి, విడాకులు అనేవి కామన్ అయిపోయాయి. ఓవైపు హీరో హీరోయిన్ పెళ్లి చేసుకుని న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తుంటే.. మరికొందరేమో కొన్ని సంవత్సరాల తన వైవాహిక బంధానికి చిన్న చిన్న మనస్పర్ధలు రావడం వల్ల ముగింపు పలుకుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ హీరోయిన్ తనకు విడాకులు లేని పెళ్లి కావాలని.. అసలు పెళ్లంటేనే భయమేస్తుందని షాకింగ్ కామెంట్స్ చేసింది.
సినీ నటి అభిరామి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ.. తన సోదరి సింగర్ అమృత సురేష్ జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ.. “నేను విడాకులు లేని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అది జరుగుతుందో లేదో నాకు తెలియదు. అందుకు కొంత అదృష్టం కూడా ఉండాలి. నేను పెళ్లికి వ్యతిరేకం కాదు.. కానీ మా అక్క జీవితంలో పడ్డ కష్టాలు చూసిన తర్వాత నాకు పెళ్లంటేనే భయంగా ఉంది. ఇప్పటికీ నేను పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఆ భయమే. అది ఏదో ఒకరోజు జరుగుతుందని నేను నమ్ముతున్నాను. మనం సరైన వ్యక్తిని పెళ్లి చేసుకొని విడిపోతే పర్వాలేదు.. కానీ ప్రమాదకరమైన వారితో ప్రేమలో పడిపోతేనే మరింత భయం” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
కాగా మలయాళ నటి, సింగర్ అయినటువంటి అమృత సురేష్.. నటుడు బాలాను 2010లో పెళ్లి చేసుకుంది. ఇక వీరికి కూతురు కూడా పుట్టింది. కానీ, కుటుంబంలో గొడవలు మొదలవడంతో 2019లో అమృత- బాల విడిపోయారు. విడాకుల తర్వాత తనతో పాటు కూతుర్ని వేధించాడని అమృత పోలీసులకు ఫిర్యాదు చేయగా బాలను అరెస్ట్ చేశారు. అలా జైలుకెళ్లిన బాల తాజాగా బెయిల్‌పై బయటకు వచ్చి ఇటీవలె మూడో వివాహం చేసుకున్నాడు. ఇక ఇదంతా చూసిన అమృత సోదరి, నటి అభిరామి.. పై కామెంట్స్ చేసింది.