Railway General Ticket: మీ ఫోన్‌‌లోనే జనరల్ టికెట్ ఇలా క్యాన్సిల్ చేయండి..!

by Anjali |   ( Updated:2024-12-11 07:29:06.0  )
Railway General Ticket: మీ ఫోన్‌‌లోనే జనరల్ టికెట్ ఇలా క్యాన్సిల్ చేయండి..!
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా ట్రైన్(Train) ఎక్కే ముందు ప్రయాణికులు టికెట్ కౌంటర్(Ticket counter) దగ్గర టికెట్ తీసుకుంటారు. మరికొంతంది ముందుగానే ఫోన్‌లో బుక్ చేసుకుంటారు. అయితే కొన్నిసార్లు రిజర్వేషన్(Reservation) చేసుకున్న టికెట్స్‌ను క్యాన్సిల్ చేసుకుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. దీనిలాగే జనరల్ టికెట్(General ticket) కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. కానీ ఈ విషయం ఎక్కువ మందికి తెలియదు. టికెట్ బుక్ చేసుకున్నాక.. ప్రయాణం మార్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడు టికెట్ డబ్బు వృథా అయిపోయిందే అంటూ బాధపడుతుంటారు. అలాంటి బాధేమీ లేకుండా జనరల్ టికెట్ కూడా ఎలా రద్దు చేయాలో ఇప్పుడు చూద్దాం..

ఒకవేళ మీరు టికెట్ క్యాన్సిల్ చేయాలనుకుంటే.. టికెట్ తీసుకున్న మూడు గంటల లోపే స్టేషన్ మాస్టర్‌(Station Master)కు టికెన్ ఇవ్వాల్సి ఉంటుంది. IRCTC వెబ్‌సైట్ లేకపోతే యాప్ ద్వారా క్యాన్సిల్ చేస్తారు. రైలు బయల్దేరే ముందు టికెట్‌ క్యాన్సిల్ చేసినట్లైతే రీఫండ్(Refund) ఈజీగా పొందవచ్చు. రైలు దారి మార్చినప్పటికీ కూడా మీరు జర్నీ చేయకపోతే, TDR ఫైల్ చేసి రీఫండ్ పొందవచ్చు. ప్రస్తుతం మీ ఫోన్‌లోనే ఈ యూటీఎస్(UTS) అనే యాప్ లో కూడా టికెట్ రద్దు చేసుకోవచ్చు.

ఫస్ట్ మీ ఫోన్ నెంబర్‌తో ఈ యాప్ లో లాగిన్ అవ్వాలి. పాస్వార్డ్ కొట్టి.. యూటీఎస్ యాప్ ఓపెన్ చేయాలి. తర్వాత క్యాన్సిల్ ఆప్షన్ వస్తుంది. ఇప్పుడు దాన్ని క్లిక్ చేస్తే టికెట్ క్యాన్సిల్ అని రాగానే దాన్ని కూడా క్లిక్ చేయాలి. తిరిగి చెల్లింపు డిటైయిల్స్ అన్ని క్షుణ్ణంగా చదివాక.. ఓకే నొక్కండి. టికెట్ మనీ కూడా మీ అకౌంట్‌లో యాడ్ అవుతాయి. అయితే 30 రూపాయల కంటే ఎక్కువ మొత్తం మనీ ఉన్న టికెట్లు మాత్రమే క్యాన్సిల్ అవుతాయి.

Advertisement

Next Story

Most Viewed