Munnabhai 3: ‘మున్నాభాయ్’ త్రీక్వెల్‌పై బిగ్ అప్‌డేట్ ఇచ్చిన డైరెక్టర్.. ఆనందంలో ఫ్యాన్స్

by sudharani |   ( Updated:2024-10-20 10:05:38.0  )
Munnabhai 3: ‘మున్నాభాయ్’ త్రీక్వెల్‌పై బిగ్ అప్‌డేట్ ఇచ్చిన డైరెక్టర్.. ఆనందంలో ఫ్యాన్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ (Sanjay Dutt) ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’ (Munnabhai). డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాణీ (Rajkumar Hirani) తెరెకెక్కించిన ఈ మూవీ పలు భాషల్లో రీమేక్ అయ్యి మంచి విజయాన్ని అందించింది. దీంతో ఇప్పటికే ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి క్రేజీ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రం త్రీక్వెల్ (triquel) కు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజ్‌కుమార్ హిరాణీ (Rajkumar Hirani) ‘మున్నాభాయ్’ (Munnabhai) త్రీక్వెల్‌పై బిగ్ అప్‌డేట్ ఇచ్చాడు.

‘ప్రేక్షకులు ఎంతో ఆధరించిన ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’ (Munnabhai) త్రీక్వెల్ (triquel) ను తీసేందుకు సన్నాహాలు చేస్తున్నాము. ఇప్పటికే దీని కోసం ఐదు స్క్రిప్ట్‌లను సగం పూర్తి చేశాను. ఇప్పుడు రాబోయే సినిమా గత చిత్రాల కంటే మెరుగ్గా ఉండాలనేది నా ప్రధాన కర్తవ్యం. అందుకే కథపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నా. మరో ముఖ్య విషయం ఏంటంటే.. ఈ స్క్రిప్ట్ తొందరగా పూర్తి చెయ్యకపోతే సంజు ఇంటికి వచ్చి దీన్ని పూర్తి చేయమని నన్ను బెదిరించే అవకాశం కూడా ఉంది’ అంటూ చెప్పుకొస్తూ.. త్వరలో పూర్తి వివరాలు ప్రకటిస్తాం అని తెలిపారు. ప్రజెంట్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాణీ (Rajkumar Hirani) కామెంట్స్ వైరల్ కావడంతో.. ‘మున్నాభాయ్’ (Munnabhai) ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తు్న్నారు.

Advertisement

Next Story