- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 'డిటాక్స్ డ్రింక్స్'
దిశ, ఫీచర్స్ : శరీరంలోని కీలక అవయవాల్లో కాలేయం ఒకటి. మలినాలను బయటకు పంపేందుకు డిటాక్సిఫికేషన్ చేయడంతో పాటు పోషకాల నియంత్రణ, ఎంజైమ్స్ రెగ్యులేషన్‌లో సాయపడుతుంది. జీర్ణక్రియ, జీవక్రియలు సైతం కాలేయ పనితీరు పై ఆధారపడి ఉంటాయి. అటువంటి లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు కొన్ని డిటాక్స్ డ్రింక్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాలు..
గ్రీన్ టీ :
వెయిట్ లాస్‌తో పాటు హార్ట్, బ్రెయిన్ హెల్త్‌కు మేలు చేసే గ్రీన్ టీ.. కాలేయానికి కూడా మంచిదని అధ్యయనాలు చెబుతున్నాయి. మరోవైపు 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్‌కు పైగా ప్రజలు లివర్ ఫ్యాట్ బారినపడతారని అంచనా. ఈ నేపథ్యంలోనే నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ గల వ్యక్తులు.. క్రమం తప్పని వ్యాయామం సహా 'డైట్ గ్రీన్ టీ' తో ఉత్తమ ఫలితాలు పొందవచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఇది కాలేయ కొవ్వు తీవ్రతను 75 శాతం తగ్గిస్తుందని చెబుతున్నారు. ఇక గ్రీన్ టీలో ఉండే పాలీఫెనాల్స్.. ఆహారంలోని కార్బోహైడ్రేట్స్, కొవ్వు, ప్రొటీన్ల విచ్ఛిన్నతను పాక్షికంగా నిరోధిస్తాయని పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి.
బీట్‌రూట్ జ్యూస్ :
'యాంటీఆక్సిడెంట్స్, ఫోలేట్, ఫైబర్, మాంగనీస్, పొటాషియం, విటమిన్ ఏ, విటమిన్ సి' వంటి పోషకాలు బీట్‌రూట్‌లో పుష్కలంగా ఉంటాయి. ఇవి పిత్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో సాయపడటమే కాక శరీరం నుంచి మలినాలను తొలగించడం లో దోహదపడతాయి. కాబట్టి బీట్‌రూట్ జ్యూస్ కాలేయ ఆరోగ్యానికి ప్రయోజనకారి.
కాఫీ :
సరైన మోతాదులో కాఫీ తాగడం వల్ల కాలేయ పనితీరు మెరుగుపడుతుందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. కాఫీ సేవనం కాలేయంలోని లిపిడ్ నిల్వలను తగ్గిస్తుంది. యాంటీఆక్సిడెంట్ సామర్థ్యాన్ని పెంపొందించడం ద్వారా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గ్లూటాతియోన్ ఉత్పత్తిని పెంచుతుంది. అయితే మితంగా తీసుకోవడమే మేలు.
టర్మరిక్ టీ :
సాధారణంగా పసుపును సూపర్ ఫుడ్‌గా అభివర్ణిస్తారు. ఇందులోని యాక్టివ్ కర్కుమిన్ పదార్థం.. కాలేయ కణాలను రిపేర్ చేసే యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. ఇవి పిత్త ఉత్పత్తిని పెంచే క్రమంలో లోహాల డీటాక్సిఫికేషన్ ప్రక్రియ నందు కాలేయానికి సాయపడతాయి. ఇక 'పసుపు టీ' లో యాలకులు, లవంగాలు, మిరియాలు వంటి సుగంధ ద్రవ్యాలను కలపడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
ఆమ్లా జ్యూస్ :
ఉసిరిని సరైన మోతాదులో తీసుకోవడం వల్ల లివర్ ఫైబ్రోసిస్ తదితర సమస్యలు రాకుండా నిరోధించవచ్చు. అలాగే హైపర్లిపిడెమియా(అదనపు కొవ్వు) తగ్గుతుందని అనేక అధ్యయనాలు కనుగొన్నాయి. అయితే ఈ డిటాక్స్ డ్రింక్స్ అందరి శరీర తత్వాలకు సరిపడవు. అందుకే ఈ పానీయాలను డైట్‌లో భాగం చేసుకునేముందు వైద్యుడి సలహా తీసుకోవడం ఉత్తమం.