- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అనుమతి లేనిదే దేశం వదలి వెళ్లొద్దు: ఆకార్ పటేల్‌కి ఢిల్లీ కోర్టు ఉత్తర్వు
న్యూఢిల్లీ: ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా బోర్డు మాజీ చైర్ పర్సన్‌గా వ్యవహరించిన ప్రముఖ రచయిత ఆకార్ పటేల్‌ని అనుమతి లేనిదే దేశం వదలి వెళ్లవద్దని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. ఆకార్ పటేల్‌పై ఉన్న లుకౌట్ నోటీసును రద్దు చేయవలసిందిగా గురువారం ఢిల్లీ కోర్టు సీబీఐకి ఇచ్చిన ఉత్తర్వులపై ఆ సంస్థ రివిజన్ పిటిషన్ వేసిన నేపథ్యంలో దానిపై తుది నిర్ణయం తీసుకునేవరకు ఆకార్ పటేల్ దేశం విడిచి వెళ్ళవద్దని న్యాయస్థానం సూచించింది. ఢిల్లీ కోర్టు అదనపు సెషన్స్ జడ్జి జస్టిస్ సంతోషం స్నేహి మాన్ శుక్రవారం దీనిపై విచారణ ప్రారంభించారు. తన కింది అధికారులు చేస్తున్న అవకతవకలకు గాను సీబీఐ డైరెక్టర్ స్వయంగా క్షమాపణను రాతపూర్వకంగా రాసి ఇవ్వాలని గురువారం మెట్రోపాలిటన్ న్యాయమూర్తి ఇచ్చిన ఆదేశంపై కూడా అదనపు సెషన్స్ జడ్జి స్టే విధించారు.
ముందస్తుగా ప్లాన్ చేసుకున్న సమయానికి తనను విదేశీ ప్రయాణ చేయకుండా విమానాశ్రయంలో అడ్డుకుని తర్వాత తనపై లుకౌట్ నోటీసు ఉందని సీబీఐ చెప్పడంపై ఆకార్ పటేల్ వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా డిల్లీ కోర్టు గురువారం సీబీఐపై మండిపడింది. పిటిషన్‌దారు ఆర్థిక నష్టాలతోపాటు మానసికంగా కూడా వేధింపునకు, మనస్తాపానికి గురయ్యారని చెబుతూ కోర్టు సీబీఐ సంస్థ డైరెక్టరుగా ఈ తప్పిదానికి బాధ్యత వహించి క్షమాపణ చెప్పాలని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.