- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Deepika Padukone: నా తీరును తప్పు పట్టారు.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone) గురించి తెలిసిందే. ఇటీవల ‘కల్కి 2898ఏడీ’ (Kalki 2898 AD) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు.. తాజాగా పండండి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ప్రెగ్నెన్సీతో ఉన్నప్పటికీ రెండు సినిమాల్లో నటించిన దీపికా పదుకొణె.. ‘కల్కి’ రిలీజ్ టైంలో ప్రమోషన్స్‌లో పాల్గొంటూ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రజెంట్ పాపతో తన టైమ్ స్పెండ్ చేస్తున్న దీపిక.. సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూ(Interview)లో పాల్గొన్న ఈ బ్యూటీ.. కెరీర్ స్టార్టింగ్‌లో ఆమె ఎదుర్కొన్న విమర్శల గురించి చెప్పుకొచ్చింది.
‘బాలీవుడ్ (Bollywood) ఇండస్ట్రీలోకి నేను ‘ఓం శాంతి ఓం’ చిత్రంతో అడుగు పెట్టాను. ఆ టైంలో కొన్ని నెగిటివ్ (Negative) రివ్యూలు వచ్చాయి. అందులో ఒక నెగిటివ్ కామెంట్ నన్ను ఎంతో బాధ పెట్టింది. నా యాస, మాట తీరు, ప్రతిభ, సామర్థ్యాల గురించి తక్కువగా మాట్లాడారు. నిజానికి ఆ కామెంటే నన్ను నేను పూర్తి స్థాయిలో ప్రూవ్ చేసుకునేలా చేసింది. ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది.. నెగిటివ్ రివ్యూలు కూడా ఒక్కోసారి మనకు మంచే చేస్తాయి అని. అయితే.. వాటిని మనం తీసుకునే విధానంపై ఆధారపడి ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చింది.