Kangana Ranaut: కంగనా ఇంట్లో తీవ్ర విషాదం.. దయచేసి ప్రార్థించండి అంటూ ఎమోషనల్ పోస్ట్

by Hamsa |
Kangana Ranaut: కంగనా ఇంట్లో తీవ్ర విషాదం.. దయచేసి ప్రార్థించండి అంటూ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్(Kangana Ranaut) ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె అమ్మమ్మ ఇంద్రాణి ఠాకూర్(Indrani Thakur) తుది శ్వాస విడిచింది. ఈ విషయాన్ని తెలుపుతూ కంగనా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ఈ మేరకు కంగనా ‘‘నిన్న రాత్రి మా అమ్మమ్మ ఇంద్రాణి ఠాకూర్ జీ మరణించారు. కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది.

దయచేసి ప్రార్థించండి. అమ్మమ్మ అద్భుతమైన మహిళ. ఆమెకు 5 మంది పిల్లలు ఉన్నారు. ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా తన పిల్లలందరికీ మంచి విద్యాసంస్థలో ఉన్నత విద్యను అందేలా చూశారు. పెళ్లైన తర్వాత తన కుమార్తెలు పని చేయాలని వారి స్వంత వృత్తిని కలిగి ఉండాలని సూచించారు.

కుమార్తెలకు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయి. ఇది ఆ రోజుల్లో అరుదైన విజయం. ఆడవారిలో సహా ఆమె 5 మంది పిల్లలు ఇప్పుడు మంచిగా స్థిరపడ్డారు. తన పిల్లల కెరీర్ గురించి చాలా గర్వంగా ఫీల్ అయ్యేవారు’’ అని రెండు పోస్టులు షేర్ చేసింది. అయితే ఇంద్రాణి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి నవంబర్ 8వ తేదీ శుక్రవారం రాత్రి మరణించినట్లు సమాచారం.

Next Story

Most Viewed