మళ్లీ మొదలైన ఫిర్యాదులు.. టీ-కాంగ్రెస్‌లో కొత్త పంచాయితీ

by GSrikanth |
మళ్లీ మొదలైన ఫిర్యాదులు.. టీ-కాంగ్రెస్‌లో కొత్త పంచాయితీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్‌లోని అసంతృప్తుల మధ్య గొడవలు సద్దుమనగడం లేదు. ఇప్పటికే రేవంత్ రెడ్డిపై.. ఆయన వ్యతిరేక వర్గం కాంగ్రెస్ హైకమాండ్‌కు ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. అనంతరం టీకాంగ్రెస్ నేతలకు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నచ్చజెప్పి పంపించిన విషయం తెలిసిందే. అయితే, అంతా సద్దుమనిగిందనుకున్న సమయానికి మాజీ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర్ రెడ్డిలపై అధిష్టానానికి అద్దంకి దయాకర్ ఫిర్యాదు చేశారు.

తాను ప్రాతినిత్యం వహిస్తోన్న తుంగతుర్తి నియోజకవర్గంలో పార్టీకి నష్టం కలిగించిన డాక్టర్ రవిని వీరంతా ప్రోత్సహిస్తున్నారని సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఫిర్యాదు చేశారు. అంతేగాకుండా, ఆరేళ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వ్యక్తిని తిరిగి పార్టీలోకి తీసుకొచ్చే కుట్ర చేస్తున్నారని అద్దంకి ఆరోపించారు. 2018లో పోటీ చేయొద్దని రవికి చెప్పినా వినకుండా పోటీ చేసి పార్టీ ఓటమికి కారణమయ్యారంటూ విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed