ఆది మరిచారా.. అంతే సంగతులు..

by Mahesh |
ఆది మరిచారా.. అంతే సంగతులు..
X

దిశ, బెజ్జంకి: బెజ్జంకి మండల కేంద్రం నుంచి కరీంనగర్, సిద్దిపేట జిల్లా కేంద్రాలకు ప్రజలు రాకపోకలు సాగించే ప్రధాన రోడ్డు బెజ్జంకి-బెజ్జంకి క్రాసింగ్ గ్రామం బీటీ రోడ్డు. గత కొద్ది నెలల క్రితం విరివిగా కురిసిన వర్షాల వరద ఉధృతికి బెజ్జంకి క్రాసింగ్ శివారులోని బీటీ రోడ్డు పై నిర్మించిన కల్వర్టు పై నుంచి వరద నీరు పొంగి పొర్లింది. దీంతో కల్వర్టు పరిసర ప్రాంతాల్లో సాగు చేస్తున్న పంటలు నీట మునిగాయి. వరద ఉధృతికి బీటీ రోడ్డు గ్రావెల్ సైతం కోతకు గురైంది. నిత్యం మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల ప్రజలు అవసరాల రీత్యా నిత్యం వాహనాల్లో రాకపోకలు సాగిస్తుంటారు.

వర్షాల నీటి ఉధృతికి రోడ్డు గ్రావెల్ కొట్టుకుపోయి అక్కడక్కడ గుంతలు ఏర్పడి ప్రయాణీకులకు ప్రమాదకరంగా మారాయి. పాలకులు చూసి చూడనట్లు వ్యవహరించడం, అధికారులు కన్నెత్తి చూడక పోవడం గమనార్హం. పాలకులు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మండలం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని చెబుతున్నారు. కానీ ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వహిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రమాదాలు చోటుచేసుకోకుండా మానవత్వంతో నైనా పాలకులు స్పందించి గుంతలు పూర్తిగా పూడ్చేందుకు చొరవ చూపాలని పలువురు వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed