Komatireddy Rajgopal Reddy: పార్టీ మార్పుపై స్పందించిన కోమటిరెడ్డి.. మళ్లీ సంచలన వ్యాఖ్యలు

by GSrikanth |   ( Updated:2022-07-22 08:17:15.0  )
Congress MLA Komatireddy Rajgopal Reddy Says, his Aim is to Defeat KCR
X

దిశ, వెబ్‌డెస్క్: Congress MLA Komatireddy Rajgopal Reddy Says, his Aim is to Defeat KCR| పార్టీ మార్పు వార్తలపై మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఓడించడమే లక్ష్యంగా రాష్ట్రంలో పనిచేస్తానని అన్నారు. టీఆర్ఎస్‌, కేసీఆర్‌ను ఓడించే పార్టీలో వెళ్తానని కుండబద్దలు కొట్టారు. చండూరులో తాను కార్యకర్తలతో ఏర్పాటు చేసుకున్నది రాజకీయ సమావేశం కాదని స్పష్టం చేశారు. అభివృద్ధి నిధులు నియోజకవర్గానికి రాకుండా టీఆర్ఎస్ అడ్డుకుంటోందని మండిపడ్డారు. ఎనిమిదేళ్లుగా రాష్ట్రంలో టీఆర్ఎస్ ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు. నాణ్యత లేని కట్టడాలు కట్టి అక్రమంగా నిధులు మళ్లించి, జేబులు నింపుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఓటమిని ఎవరూ ఆపలేరని అన్నారు. ప్రజలే రాష్ట్రం నుంచి తరిమికొడతారని వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: టీఆర్ఎస్‌పై బీజేపీ మరో అస్త్రం.. కేసీఆర్‌కు ఇక చిక్కులే..?

Advertisement

Next Story