నిలోఫర్‌లో చిన్నారులు మరణాలపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు

by Nagaya |
నిలోఫర్‌లో చిన్నారులు మరణాలపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు
X

దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్‌లోని నిలోఫర్​ఆసుపత్రిలో చిన్నారులు మరణిస్తున్నారని న్యాయవాది రాపోలు భాస్కర్​ మనవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. బుధవారం ఒక్కరోజే 12 గంటల వ్యవధిలో 12 మంది చిన్నారులు మృతి చెందారని పలు మాధ్యమాల్లో వచ్చినట్లు వివరించారు. దీనిపై పూర్తి స్థాయి ఎంక్వైరీ వేసి చర్యలు తీసుకోవాలన్నారు. ఒకేరోజు వైద్యులు పెద్ద సంఖ్యలో విధులకు గైర్హాజరు కావడం వల్ల ఈ ఘటన చోటు చేసుకున్నట్లు వివరించారు. సామాన్య , మధ్య తరగతి ప్రజలు వచ్చే ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఉండటం వల్లనే ఇలాంటి సమస్యలు చూడాల్సి వస్తున్నదని స్పష్టం చేశారు. నిత్యం వైద్యసిబ్బంది కొరత వేధిస్తూనే ఉంటుందన్నారు. దీంతో చికిత్స ఆలస్యమై చిన్నారులు మరణిస్తున్నట్లు వివరించారు. చిన్నారుల మరణాలకు కారకులైన వైద్యులు, అధికారులపై చర్యలు తీసుకొని, భవిష్యత్తులో మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టు న్యాయవాది రాబోలు భాస్కర్ హెచ్​ఆర్​సీని కోరారు.

Advertisement

Next Story

Most Viewed