- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లైబ్రరీలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక నిర్ణయం
దిశ, తెలంగాణ బ్యూరో : ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు వేసింది. ఈమేరకు పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే నిరుద్యోగుల కోసం 100 లైబ్రరీల్లో మెటీరియళ్లను అందుబాటులో ఉంచుతున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈమేరకు ఆమె శనివారం విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానీయా, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, శాఖ అధికారులతో తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా రాష్ట్రంలోని ఎంపిక చేసిన 100 లైబ్రరీల్లో పూర్తిస్థాయి పుస్తకాలను అందుబాటులో ఉంచాలని ఆమె గ్రంథాలయ శాఖ అధికారులకు ఆదేశించారు. నిరుద్యోగులకు ఇబ్బందులు కలగకుండా ఇతర సౌకర్యాలను కూడా కల్పించాలన్నారు.
రాష్ట్రంలోనే మొదటగా వికారాబాద్ జిల్లా లైబ్రరీలో ఈ నెల 31 ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. ఇదిలా ఉండగా మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి కార్యక్రమంలో భాగంగా పలు పాఠశాలలను ఆమె సందర్శించారు. రంగారెడ్డి జిల్లా శివరాంపల్లి, జిల్లెలగూడాతో పాటు నగరంలోని ఆలియా, మహబూబియా(బాలికల) పాఠశాలలు ఎంపిక చేసినట్లు మంత్రి తెలిపారు. ఆయా పాఠశాలలలో మౌలిక సదుపాయాల కల్పన కు కృషి చేస్తున్నట్లు తెలిపారు. విద్యుత్, తాగునీరు, మరుగుదొడ్లు, ప్రహరీ గోడలతో పాటుగా ఇతర మరమ్మతులు, పెయింటింగ్ పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. అనంతరం ఫర్నీచర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.