సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ క్యాన్సిల్.. చివరి నిమిషంలో కీలక నిర్ణయం

by Satheesh |
సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ క్యాన్సిల్.. చివరి నిమిషంలో కీలక నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ధాన్యం కొనుగోలుపై ఉద్యమాన్ని ఉదృతం చేయాలని భావించిన కేసీఆర్ఢిల్లీకి వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. పీఎం మోడీతో భేటీ అవుతారని ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో క్యాన్సిల్ అయింది. టీఆర్ఎస్‌ఎల్పీ సమావేశంలోనే పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఎంపీలకు, మంత్రులకు దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ వెళ్లకుండా ఢిల్లీకి మంత్రులు, ఎంపీల బృందం వెళ్లనుంది. ఈ బృందంలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, గుంటకండ్ల జగదీష్ రెడ్డి, ఎంపీలు కేకే, నామనాగేశ్వర్ రావుతో పాటు మిగతా ఎంపీలంతా వెళ్లనున్నారు. కేంద్రమంత్రులను కలిసి మెమోరండం అందజేస్తారు. రా రైస్ కాకుండా ధాన్యం మొత్తంను పంజాబ్, గుజరాత్ మాదిరిగా కొనుగోలు చేయాలని కోరనున్నారు. ఎంఎస్పీ ధరకు ధాన్యం కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు. కేంద్రం స్పందించే దానిని బట్టి ఢిల్లీలో ధర్నాకు కార్యచరణ చేపట్టనున్నారు.

రైతు సమస్య తెలంగాణకే కాదని దేశ వ్యాప్త రైతన్నల జీవన్మరణ సమస్యగా పేర్కొంటూ నిరసన కార్యక్రమాలకు ప్రణాళికలను గులాబీ బాస్ సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కిసాన్ సంఘ్ నేతలతో భేటీ నిర్వహించిన కేసీఆర్ మరోసారి కేంద్రంపై రైతుల పక్షాన పోరుకు సిద్ధమవుతున్నారు. ధాన్యం కొనుగోళ్లపై నిర్వహించే ధర్నాకు కిసాన్ సంఘ్ నేతలు సైతం సంఘీభావం తెలిపారని వెల్లడించారు. అయితే మంత్రులు, ఎంపీల బృందం కేంద్రమంత్రులతో భేటీ తర్వాత వచ్చే రెస్పాన్స్ బట్టి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపడతామని, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed