ఎంతమంది పండిట్లను తీసుకొచ్చారు..? బీజేపీపై కేజ్రీవాల్ ఫైర్

by Satheesh |
ఎంతమంది పండిట్లను తీసుకొచ్చారు..? బీజేపీపై కేజ్రీవాల్ ఫైర్
X

న్యూఢిల్లీ: కశ్మీరీ పండిట్ల వలసలను అడ్డుపెట్టుకుని బీజేపీ రాజకీయాలు చేస్తోందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో ఆరోపించారు. కేంద్రంలో కాషాయ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎంత మంది పండిట్లను తిరిగి లోయకు తీసుకొచ్చారని ఆయన ప్రశ్నించారు. గత కొన్ని రోజులుగా 'ది కాశ్మీర్ ఫైల్స్' చిత్రంపై కేజ్రీవాల్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ సమావేశాల అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ మరోసారి బీజేపీని టార్గెట్ చేశారు.

కశ్మీర్ ఫైల్స్ సినిమాను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసి, ఇప్పటివరకు ఆ సినిమాకు వచ్చిన కలెకన్లను కాశ్మీరీ పండిట్ల సంక్షేమం కోసం ఖర్చుచేయాలని డిమాండ్ చేశారు. 25 ఏళ్ల కిందట కాశ్మీరీ పండిట్లు వలస వెళ్లాక కేంద్రంలో 13 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వాలు మారుతూ వచ్చాయి. మోడీ అధికారంలోకి వచ్చి ఇప్పటికే 8 ఏళ్లు పూర్తవ్వగా ఈ కాలంలో ఏదైనా కాశ్మీరీ పండిట్ కుటుంబానికి పునరావాసం లభించిందా? ఒక్క కుటుంబం కూడా కాశ్మీర్‌కు తిరిగి రాలేదు.' పండిట్లు ఇకపైన తమ ఇళ్లకు తిరిగి వెళ్లేలా కేంద్రం గట్టి చర్యలు తీసుకోవాలని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. కాగా, 'ది కాశ్మీర్ ఫైల్స్' మూవీ సుమారు ₹200 కోట్లు సంపాదించిందని, ఒకరి జీవితం ఆధారంగా బీజేపీ డబ్బు సంపాదిస్తోందన్నారు. ఇది నేరం, దీనిని దేశం ఎన్నటికీ సహించదని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story