- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ మార్కెట్‌లో అధికారుల మాటలు బేఖాతర్.. అందుకే గొడవలు
దిశ, వైరా: వైరా మున్సిపాలిటీలో నూతన సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనుల నేపథ్యంలో పాత కూరగాయల మార్కెట్ తొలగించారు. ఈ నేపథ్యంలో నూతన కూరగాయల మార్కెట్ పూర్తయ్యేంతవరకు తాత్కాలికంగా హరిత రెస్టారెంట్ నందు మార్కెట్ నిర్వహించేందుకు మున్సిపల్ అధికారులు స్థలం కేటాయించారు. ఈ షాపుల కేటాయింపు అధికారుల సమక్షంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా లాటరీ పద్ధతిలో ఎంపిక చేశారు. ఇక్కడ వరకు బాగానే ఉంది.. కానీ లాటరీ పద్ధతిలో వచ్చిన షాపులను ఏర్పాటు చేశారు.
లాటరీలో షాపులు కేటాయించిన విధంగా అందరికీ ఒకే విధంగా షాపులు ఏర్పాటు చేశారు. లాటరీలో వచ్చిన వారి తోపుడు బండ్లు పక్కన ఇంకొకరు వచ్చి మార్కెట్లో బండ్లు అడ్డంగా పెట్టడం గొడవలకు కారణం అవుతుంది. ఈ నేపథ్యంలో ఉయ్యూరు వాసు కూరగాయల వ్యాపారి లాటరీలో స్థానికంగా ఉన్న మరో వ్యాపారి కారుకొండ బోస్ కు కేటాయించిన బండి వద్ద, బండి పెట్టడంతో అధికారులకు వ్యాపారులు ఫిర్యాదు చేశారు. దీంతో కమిషనర్ పోలీస్, మున్సిపాలిటీ సిబ్బంది వచ్చి అడ్డంగా ఉన్న వాసు బండి తొలగించారు.
మరల వాసు అధికారుల ఆదేశాలు పక్కన పెట్టి అధికారులు వేసిన పెన్సింగ్ తీసి వేసి బండి అడ్డంగా పెట్టాడు. రాత్రి పూట వ్యాపారం బంద్ అయిన తర్వాత ఎండలు బాగా వస్తున్నాయని నీడ కోసం బోస్ ఏర్పాట్లు చేస్తుండగా బోస్ పై వాసు దాడి చేశాడు. ఈ దాడిలో బోస్ కు తీవ్ర గాయాలయ్యాయి. తల పగిలి రక్తస్రావం కావడంతో ఆస్పత్రికి తరలించామని పలువురు కూరగాయలు వ్యాపారులు తెలిపారు. మున్సిపల్, పోలీస్ అధికారుల సమక్షంలో అడ్డంగా పెట్టినా వాసు బండి అక్కడ నుండి తరలించారు.
కానీ మరల వాసు బండి అక్కడ పెట్టడం వలనే కూరగాయలు మార్కెట్ లో గొడవలు జరుగుతున్నాయని ఆ బండి తొలగించాలని వ్యాపారులు కోరుతున్నారు. అసలు మున్సిపాలిటీ అధికారులు కేటాయింపునకు వ్యతిరేకంగా బండి అడ్డంగా పెట్టి షాపులుకు ఇబ్బంది కలిగే విధంగా పెట్టొద్దని పదేపదే అధికార యంత్రాంగం చెప్పినప్పటికీ.. మరల బండి పెట్టడం మార్కెట్లో గొడవలకు కారణం అవుతున్నా.. వారి పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వ్యాపారస్తులు ప్రశ్నిస్తున్నారు. కూరగాయల వ్యాపారం లో ఎలాంటి గొడవలు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకొని, అధికారులు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరూ నడుచుకునేలా చర్యలు తీసుకోవాలని వ్యాపారులు కోరుతున్నారు.