- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ పాలనలో అలాంటి వారికి స్థానం లేదు: చింతా ప్రభాకర్
దిశ, సదాశివపేట: ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక చిల్లర రాజకీయాలకు పాల్పడితే సహించేది లేదని మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ హెచ్చరించారు. సోమవారం సదాశివపేట పట్టణంలో కేసీఆర్ ఆదేశాల మేరకు కొన్ని వార్డులలో పర్యటన చేశారు. ప్రజల సమస్యలు స్వయంగా తెలుసుకుని పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధి విషయంలో వివక్ష చూపదని.. అందరిని కలుపుకుని రాజీలేకుండా పనిచేస్తుందని తెలిపారు. కేసీఆర్ పాలనలో చిల్లర రాజకీయాలు చేసే వారికి స్థానం లేదని.. అలాంటి వారికి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. చింతా ప్రభాకర్ పర్యటనకు ప్రజలు పూర్తి మద్దతు తెలియజేస్తున్నారు.
సంగారెడ్డి నియోజకవర్గంలో మహిళా దినోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సదాశివపేట మున్సిపల్ చైర్ పర్సన్ పిల్లోడి జయమ్మ, వైస్ చైర్మన్ చింత గోపాల్ కౌన్సిలర్లు, పిల్లోడి విశ్వనాథం చౌదరి ప్రకాష్, పులిమామిడి రాజు, కో ఆప్షన్ సభ్యుడు కోడూరు అంజయ్య, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు, చీర మల్లన్న వీరేశం సీనియర్ నాయకులు కోడూరి రమేష్, కార్యకర్తలు ముఖ్యనాయకులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.