గుడ్ న్యూస్.. ఆ ఉద్యోగులకు కార్లు ఫ్రీ

by S Gopi |   ( Updated:2022-04-12 09:10:44.0  )
గుడ్ న్యూస్.. ఆ ఉద్యోగులకు కార్లు ఫ్రీ
X

దిశ, వెబ్ డెస్క్: చెన్నైకి చెందిన ఓ ఐటీ సంస్థ తమ ఉద్యోగులకు 100 కార్లను బహుమతిగా ఇచ్చింది. కంపెనీ అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన ఉద్యోగులను ఎంకరేజ్ చేస్తూ కార్లను బహుమతిగా ఇచ్చింది. 100 మంది ఉద్యోగులు పదేళ్లకు పైగా తమ సంస్థలో పని చేస్తున్నారని, వారికి కార్లను బహుమతిగా ఇస్తున్నట్లు ఆ కంపెనీ పేర్కొన్నది. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ.. సంస్థ నుండి బహుమతులు అందుకోవడం సంతోషంగా ఉందని, ప్రతి సందర్భంలో తమకు కంపెనీ బంగారు నాణేలు, ఐఫోన్‌లు వంటి బహుమతులుగా ఇస్తున్నదని, ఈసారి కార్లను బహుమతిగా ఇవ్వడంతో తమకు హ్యాపీగా ఉందని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed