Samantha: చైతన్య- శోభిత ఒక్కటి కాబోతున్న వేళ.. ఆ ఇద్దరి వల్ల ఎంత ఏడ్చానో అంటూ సమంత సంచలన కామెంట్స్

by Kavitha |   ( Updated:2024-11-11 14:28:12.0  )
Samantha: చైతన్య- శోభిత ఒక్కటి కాబోతున్న వేళ.. ఆ ఇద్దరి వల్ల ఎంత ఏడ్చానో అంటూ సమంత సంచలన కామెంట్స్
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అక్కినేని హీరో నాగచైతన్యతో విడాకుల తర్వాత మయోసైటీస్ అనే వ్యాధి బారిన పడి గత ఏడాదిగా సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. హెల్త్ పై ఫోకస్ పెట్టింది. కాగా తాజాగా ‘సిటాడెల్: హనీ బన్నీ’ అనే వెబ్ సిరీస్‌తో మన ముందుకు వచ్చింది. బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా నటించిన ఈ సిరీస్ నవంబర్ 7నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం ఈ సిరీస్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇక సమంత యాక్టింగ్‌కు అయితే ఫుల్ మార్కులే పడ్డాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత.. రాజ్ అండ్ డీకేల కారణంగా తాను షూటింగ్‌లో ఏడ్చేశానని తెలిపారు. అయితే దక్షిణాదిలో తాను నటించిన సినిమాలు రోజుకు రెండు లేదా మూడు సీన్స్ తీసేశారని.. కానీ రాజ్ అండ్ డీకేలు గంటలోనే ఆ సీన్స్ చిత్రీకరించారని సమంత అన్నారు. ఈ దెబ్బతో మేనేజర్‌కు ఫోన్ చేసి.. తన వల్ల కావడం లేదని ఏడ్చేశానని చెప్పారు. తర్వాత వారిద్దరి మేకింగ్‌కు తాను అలవాటు పడ్డానని సమంత చెప్పుకొచ్చింది. ఇక నాగ చైతన్య, శోభితలు ఒక్కటి కాబోతున్న టైంలో సమంత చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.


Read More ...

Samantha: ‘అమ్మ అవ్వాలని ఉంది’.. సమంత కీలక వ్యాఖ్యలు.. రెండో పెళ్లి చేసుకోబోతోందా..?

Advertisement

Next Story

Most Viewed