- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించాలి'
దిశ, తెలంగాణ బ్యూరో: టూరిజం కార్పోరేషన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ముఖ్యమంత్రికి లేఖ రాశారు. టూరిజం కార్పోరేషన్‌లో సుమారు 25 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ పద్దతిలో దాదాపు 170 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారని, ఉమ్మడి రాష్ట్రం నుండి 'సమాన పనికి సమాన వేతనం' ఇస్తున్నారని, ఈ మధ్య కాలంలో రెగ్యులర్ ఉద్యోగులతోపాటు 30 శాతం పీఆర్‌సీని కూడా ప్రభుత్వం ఇవ్వడం జరిగిందన్నారు.
అయితే చాలా కాలం నుంచి టూరిజం కార్పోరేషన్‌లో ఉద్యోగుల క్రమబద్దీకరణ లేకపోవడంతో ఉద్యోగులు తీవ్ర నిరాశకు లోనైతున్నారని, అయితే ఈ బడ్జెట్ సమావేశంలో మీరు అసెంబ్లీ సాక్షిగా రాష్ట్రంలోని అన్ని శాఖలలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటించినట్లు గుర్తు చేశారు. ఈ ప్రకటనతో టూరిజం కార్పోరేషన్ ఉద్యోగులు కూడా సంతోషం వ్యక్తం చేశారని, అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీ ప్రకారం టూరిజం కార్పోరేషన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను వెంటనే క్రమబద్దీకరించాలని కోరారు.