Chitra Ramkrishna: ఎన్ఎస్‌ఈ మాజీ సీఈఓ చిత్రా రామకృష్ణపై మరో కేసు!

by Manoj |   ( Updated:2022-07-08 10:15:54.0  )
CBI Files New Case Against Former NSE CEO Chitra Ramkrishna
X

న్యూఢిల్లీ: CBI Files New Case Against Former NSE CEO Chitra Ramkrishna| జాతీయ స్టాక్స్ ఎక్స్‌ఛేంజ్(ఎన్ఎస్ఈ) కేసులో ఇప్పటికే కష్టాలను ఎదుర్కొంటున్న మాజీ సీఈఓ చిత్రా రామకృష్ణపై మరో కేసు నమోదైంది. ఎన్ఎస్ఈలో అవతవకలకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె, తాజాగా స్టాక్ మార్కెట్ ఉద్యోగుల ఫోన్‌లను ట్యాప్ చేశారనే ఆరోపణలతో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో ఆమెతో పాటు ముంబై మాజీ పోలీస్ కమిషనర్ సంజయ్ పాండే, ఎన్ఎస్ఈ మాజీ సీఈఓ, ఎండీ రవి నరేన్‌లపై కూడా సీబీఐ కేసు వేసింది. దీనికి సంబంధించి సీబీఐ శుక్రవారం ముంబైతో పాటు పూణెలోని పలు ప్రాంతాల్లో సోదాలను నిర్వహించింది.

ఎన్ఎస్ఈలో సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించిన కంపెనీల్లో ఒకటైన, సంజయ్ పాండెకు చెందిన ఐసెక్ సెక్యూరిటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉద్యోగులు 2009-17 మధ్య ఎన్ఎస్ఈ ఉద్యోగుల ఫోన్‌లను ట్యాప్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇదివరకు కో-లొకేషన్ వ్యవహారం కొనసాగుతున్న సమయంలోనూ ఐసెక్ సంస్థ ఆడిట్ నిర్వహించింది. కాగా, సంజయ్ పాండె 2001లో ఉద్యోగానికి రాజీనామా చేసిన అనంతరం ఈ కంపెనీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 2006 వరకు కంపెనీ డైరెక్టరుగా చేసి కుమారులు, తల్లికి బాధ్యతలను అప్పగించారు. ఆయన రాజీనామాను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం ఇవ్వని కారణంగా తిరిగి ఉద్యోగంలో చేరారు.

Advertisement

Next Story

Most Viewed