- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాడి ఉత్పత్తి పెంచేందుకు సాయపడుతున్న యాప్..
దిశ, ఫీచర్స్ : జైపూర్‌కు చెందిన గబ్దురామ్ మీనా ఒక పశువుల వ్యాపారి. చుట్టుపక్కల సంతల్లో పశువుల విక్రయ కొనుగోళ్లు నిర్వహించేవాడు. కానీ 2020 మహమ్మారి కాలంలో ఆ సంతలన్నీ మూతపడ్డాయి. జంతు వాణిజ్యానికి సంబంధించిన చట్టాలు కూడా కఠినంగా మారాయి. ఈ నేపథ్యంలోనే మీనా ఓ యాప్ వేదికగా ఉత్తమ ధరకు పశువులు కొనుగోలు చేశాడు. మీనా మాత్రమే కాదు అతని స్నేహితులు, సహచరులు సైతం మంచి ధరకు పశువుల కొనుగోలు, విక్రయానికి ఇప్పుడు యాప్స్‌నే ఉపయోగిస్తున్నారు. ఇలాంటి క్రయవిక్రయాలకు 'మూఓఫామ్' వేదికగా నిలిచింది. గురుగ్రామ్‌కు చెందిన ముగ్గురు స్నేహితులు(జితేష్ అరోరా, అభిజీత్ మిట్టల్, ఆష్నా సింగ్, పరమ్ సింగ్) 2019లో దీన్ని ప్రారంభించగా.. గతేడాది ఈ మిత్రులు 'ఫోర్బ్స్ 30 అండర్ 30' ఆసియా జాబితాలో చోటు సంపాదించడం విశేషం. రైతులకు మేలు జాతి పశువులను ఎంచుకోవడం సహా పాడి ఉత్పత్తిని మెరుగుపరచడంలో సాయపడుతున్న ఈ యాప్ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.
ప్రపంచంలోనే పాడి ఉత్పత్తిలో భారతదేశం అగ్రస్థానంలో ఉంటుంది. ఈ రంగంలో అపార అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ నేటి యువత సరిగ్గా వినియోగించుకోవడం లేదు. ఇప్పుడిప్పుడే 'ఆన్‌లైన్ సంత'లు వెలుస్తుండగా, ఇవి రైతులకు ఉపయోగకరంగా మారాయి. కొన్నేళ్ల క్రితం ఎవరైనా సమీపంలోని పశువుల సంత నుంచి లేదా స్థానిక రైతుల నుంచి పశువులు కొనుగోలు చేసేవారు. ఇక్కడ కొనుగోలుదారులకు మరో ఆప్షన్ లేకపోగా.. మార్కెట్ ధరలు కూడా ప్రామాణికం కావు. కానీ 'మూఓఫామ్' వంటి ఆన్‌లైన్ క్యాటిల్ స్టార్టప్స్.. పశువుల కొనుగోలుదారులు, యజమానులను ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వడంలో సాయపడటమే కాక ఫైనాన్సింగ్, పశువైద్యులతో యాక్సెస్ సేవలు సహా పశువులకు బీమా కూడా అందిస్తున్నాయి. ఇక్కడ రైతులు తమ పశువుల విక్రయానికి సంబంధించిన ప్రకటనను పోస్ట్ చేసి, ఆపై పశువులను విక్రయించవచ్చు.
పశువుల ట్రాకింగ్ :
నిజానికి పోస్ట్ పెట్టగానే కొనుగోలు చేసేందుకు ఏ రైతు సిద్ధంగా ఉండడు. ఎందుకంటే అతడికి ఆయా పశువులపై అనేక అనుమానాలుంటాయి. రైతుల మాదిరే మూఓఫామ్ నిర్వాహకులకు కూడా ఏ పశువులను కొనుగోలు చేయాలి? దేన్ని దాటవేయాలి? అనే సందేహం ఉంటుంది. ఈ సమస్యను పరిష్కారంగానే వీడియో, ఇమేజ్ ఆధారిత మెషిన్ లెర్నింగ్(ML) మోడళ్లను ఉపయోగిస్తూ పశువులను కొనుగోలు చేస్తున్నారు. వాటి నాణ్యత, ధర నిర్ణయించేందుకు కూడా మెషిన్ లెర్నింగ్ వాడుతున్నారు. అంతేకాదు పశువుల ఆరోగ్య పర్యవేక్షణ, ట్రాకింగ్ సిస్టమ్‌ను కూడా ముందుగానే చెక్ చేస్తారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(IoT) ఇయర్ ట్యాగ్స్‌ను ఉపయోగించి వైటల్స్ సహా పశువుల ఈస్ట్రస్ సైకిల్‌ను ట్రాక్ చేస్తారు. ప్రస్తుతం రాజస్థాన్, పంజాబ్, హర్యానాతో పాటు మహారాష్ట్రలోని మార్కెట్లపై దృష్టి సారించినన ఈ స్టార్టప్.. 1.5 మిలియన్‌కు పైగా కస్టమర్లను కలిగి ఉంది. ఈ ఆండ్రాయిడ్ యాప్‌ను మిలియన్‌కు పైగా రైతులు డౌన్‌లోడ్ చేసుకోగా.. మూఓఅష్యూరెన్స్ కార్యక్రమం ద్వారా గత 10 నెలల్లో 20,000కు పైగా పశువులను విక్రయించింది.
పాడి రైతులకు అవగాహన :
పశువులకు ధర నిర్ణయించే విషయంలోనూ మెషిన్ లెర్నింగ్ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. యాప్‌లో ఎక్కువగా ఉపయోగించే సేవల్లో ఈ-డైరీ మిత్ర(eDairy Mitra) మూఓఫామ్ సభ, పశువుల వ్యాపార వేదిక ఉన్నాయి. ఈ డైరీ మిత్ర.. సర్వీస్ ద్వారా, రైతులు అర్హత కలిగిన నిపుణులైన పశువైద్యులను ఆన్‌లైన్ ద్వారా సంప్రదించవచ్చు. వారి సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకోవచ్చు. ఇక పాడి రైతులు మూఓఫామ్ సభ ద్వారా నాలెడ్జ్ కంటెంట్, పీర్ సపోర్ట్, నిపుణుల నుంచి చిట్కాలను పొందవచ్చు. పశువుల వ్యాపార వేదిక.. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పశువుల విక్రయం లేదా కొనుగోలుకు అనుమతిస్తుంది. ఇక రైతులు వివిధ జాతుల ఆవులు, గేదెల డేటాబేస్‌కు ప్రాప్యత కలిగి ఉంటారు. పరిమిత ప్రాంతంపై ఆధారపడకుండా తమకు సమీప ప్రాంతాల్లోని పశువులనే కొనుగోలు చేయొచ్చు. అంతేకాదు ఈ ప్లాట్‌ఫామ్‌లో వ్యవసాయ ఇన్‌పుట్స్ కూడా ఆర్డర్ చేయొచ్చు.
చిన్న ఆలోచనగా ప్రారంభించిన మా సంస్థ ఫోర్బ్స్ గుర్తించే దిశగా ఎదిగిందంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం. కానీ స్థిరమైన నిర్ణయాలు, సంకల్పబలంతో మా ప్రయత్నాన్ని కొనసాగించాం. అందుకు ప్రతిఫలమే ఈ విజయం. అంతేకాదు మా సేవలపై విశ్వాసం చూపి, వాటిని పొందడంలో సాయం చేసిన మా రైతు భాగస్వాములకే ఈ విజయం దక్కుతుంది. మేము పొందిన అభినందనలు, అవార్డ్స్ సహా దేశంలోని చాలా మంది రైతులకు సాయం చేస్తున్నామన్న సంతృప్తి మరింత గొప్పగా ఉంటుంది. ఇది మా గౌరవంగా, వేడుకగా భావిస్తున్నాం. రైతుల కోసం ఉత్తమ ఉత్పత్తులు అందిస్తున్నాం. మా సామర్థ్యం మేరకు దీన్ని కొనసాగిస్తాం.
-మూఓఫామ్ మిత్ర బృందం
భారతదేశ పాడి పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి సాయపడేందుకు మా ఉద్యోగాలు విడిచిపెట్టాం. ఈ క్రమంలో 2019లో ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా పశువుల బీమాకు పరిష్కారాన్ని కనుగొనాలని మా బృందం నిర్ణయించుకుంది. రెండు నెలల్లో నమూనాను రూపొందించి, ప్రపంచ బ్యాంక్ చాలెంజ్‌లో పాల్గొన్నాం. అక్కడ గెలిచిన తర్వాత మూఓఫామ్ ప్రారంభించాం. మా సంస్థలో ప్రస్తుతం 50 మందికి పైగా ఉద్యోగులున్నారు. ప్రస్తుతం ఈ రంగంలో ఉన్న 'యానిమల్, గౌగౌ, పశుశాల, క్రిషిఫై' మొదలైన వాటితో పోటీపడుతున్నాం. భవిష్యత్తులో పాడి రైతులకు మరింత లాభాలు తీసుకొచ్చేందుకు మావంతు ప్రయత్నం చేస్తాం. రైతులు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో, Mooofarm పాడి రైతుల కోసం ఒక ఆన్‌లైన్ డెయిరీ సర్వీస్‌ను నిర్మిస్తోంది. ఎక్కువ మంది రైతులు మాతో అనుబంధం పొందడం, సుస్థిర భవిష్యత్తు కోసం రైతులు సాంకేతికతను ఉపయోగించుకోవడం పట్ల మేము సంతోషిస్తున్నాం.
- పరమ్ సింగ్, Mooofarm వ్యవస్థాపకుడు