- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Post Office Savings Schemes :పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌లో ఈ కొత్త రూల్ తెలుసా?
పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్‌లో ఉన్నవారికి అలర్ట్. పోస్ట్ ఆఫీస్ పథకాల్లో (Post Office Schemes) ఉన్నవారికి కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి
1. మీరు ఏదైనా పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌లో (Post Office Scheme) ఉన్నారా? పోస్ట్ ఆఫీస్ అకౌంట్‌లో డబ్బులు జమ చేశారా? అయితే ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్ అమలవుతోంది. మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (MIS), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), టైమ్ డిపాజిట్ అకౌంట్ లాంటి స్కీమ్స్‌లో ఉన్నవారికి ఇకపై వడ్డీ నగదు రూపంలో లభించదు.
2. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ లేదా బ్యాంక్ అకౌంట్స్‌కి మాత్రమే ట్రాన్స్‌ఫర్ చేస్తుంది ఇండియా పోస్ట్. ఈమేరకు గతంలోనే కొత్త రూల్స్ ప్రకటించిది. ఈ కొత్త రూల్స్ 2022 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుందని తెలిపింది. గతంలో వడ్డీని నగదు రూపంలో పొందే అవకాశం ఉండేది. కానీ డిజిటల్ పద్ధతిని ప్రోత్సహించేందుకు ఇండియా పోస్ట్ ఈ కొత్త విధానాన్ని అమలు చేసింది
3. మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (MIS), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), టైమ్ డిపాజిట్ అకౌంట్ లాంటి స్కీమ్స్‌లో ఉన్నవారు తమకు లభించే వడ్డీని సేవింగ్స్ అకౌంట్‌లోకి పొందొచ్చు. లేదా చెక్ రూపంలో తీసుకోవచ్చు. సేవింగ్స్ అకౌంట్‌లోకి వడ్డీ కావాలనుకుంటే ఈ స్కీమ్స్‌కి తమ సేవింగ్స్ అకౌంట్‌ని లింక్ చేయడం తప్పనిసరి.
4. ఖాతాదారులు తమ బ్యాంక్ అకౌంట్ మొదటి పేజీ జిరాక్స్ కాపీ లేదా క్యాన్సిల్డ్ చెక్, పోస్ట్ ఆఫీస్ అకౌంట్ పాస్‌బుక్ జిరాక్స్ కాపీ పోస్ట్ ఆఫీసులో సబ్మిట్ చేయాలి. వెరిఫికేషన్ తర్వాత మీ పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌కు మీ సేవింగ్స్ అకౌంట్ లింక్ అవుతుంది. ఒకవేళ మీకు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ ఉంటే SB-83 ఫామ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది
5. పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలకు సంబంధించిన వడ్డీ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్‌లో జమ చేసేందుకు అనుమతి ఇచ్చేందుకు ఆటోమెటిక్ ట్రాన్స్‌ఫర్ సదుపాయం ఉపయోగించుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌కు సేవింగ్స్ అకౌంట్ లింక్ చేసిన తర్వాత ప్రతీ నెలా మీకు రావాల్సిన వడ్డీ మీ సేవింగ్స్ అకౌంట్‌లో జమ అవుతుంది. వడ్డీ కోసం మీరు పోస్ట్ ఆఫీసుకి వెళ్లాల్సిన అవసరం లేదు
6. ఇక పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాల విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం వడ్డీని స్థిరంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. సుకన్య సమృద్ధి యోజన పథకానికి 7.6 శాతం వడ్డీ, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌కు 7.4 శాతం వడ్డీ, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్‌కు 7.1 శాతం వడ్డీ లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతీ మూడు నెలలకు ఓసారి ఈ వడ్డీని సమీక్షిస్తుంది. వడ్డీ రేట్లు పెరగొచ్చు లేదా తగ్గొచ్చు లేదా స్థిరంగా ఉండొచ్చు.
7. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో డబ్బులు జమ చేసి ప్రతీ నెలా ఆదాయం పొందొచ్చు. కనీసం రూ.1,000 నుంచి గరిష్టంగా రూ.4,50,000 వరకు జమ చేయొచ్చు. జాయింట్ అకౌంట్‌లో గరిష్టంగా రూ.9,00,000 జమ చేయొచ్చు. ఇక సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వృద్ధుల కోసం ప్రత్యేకంగా లభిస్తున్న పథకం. 60 ఏళ్లు దాటిన వృద్ధులు, 55 ఏళ్లు దాటిన రిటైర్డ్ ఉద్యోగులు, 50 ఏళ్లు దాటిన రిటైర్డ్ డిఫెన్స్ ఉద్యోగులు ఈ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. కనీసం రూ.1,000 నుంచి రూ.15,00,000 వరకు పొదుపు చేయొచ్చు