Recharge Plans : రూ.100లోపు BSNL 5 కొత్త రీఛార్జ్ ప్లాన్స్.. పూర్తి వివరాలు తెలుసుకోండి!

by Anjali |   ( Updated:2024-12-01 14:29:40.0  )
Recharge Plans : రూ.100లోపు BSNL 5 కొత్త రీఛార్జ్ ప్లాన్స్.. పూర్తి వివరాలు తెలుసుకోండి!
X

దిశ, వెబ్‌డెస్క్: కస్టమర్ల(customers)ను ఆకట్టుకునేందుకు BSNL కొత్త సరికొత్త ప్లాన్స్ తీసుకొస్తుంది. టెలికాం సంస్థలు(Telecom companies) రేట్లు పెంచడంతో చాలా మంది బీఎస్ఎన్ఎల్(BSNL) వైపే మొగ్గుచూపుతున్నాయి. వీటి రీఛార్జ్ ధరలు(Recharge rates) కూడా చాలా తక్కువ. అంతేకాకుండా ఈ సిమ్ 4 జీ సేవలను కూడా స్టార్ట్ చేసింది. తాజాగా వినియోగదాలకు మరో గుడ్‌న్యూస్ అందించింది. వంద రూపాయల లోపు ఐదు ప్రీపెయిడ్ ప్లాన్ల(Prepaid plans)ను తీసుకొచ్చింది. ప్రైవేట్ టెలికాం సంస్థలు(Private Telecom Companies) తమ ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలను తరచూపెంచుతూనే ఉంటాయన్న విషయం తెలిసిందే.

5 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లలో రూ. 58 రిఛార్జ్ ఒకటి. ఏడు రోజు వాలిడిటీ గల ఈ ప్లాన్ లో 2 జీబీ డేటా వస్తుంది. లోకల్(Local), ఎస్టీడీ కాల్స్(STD calls) కోసం 200 నిమిషాల కాల్ మాట్లాడుకోవచ్చు. డేటా(data) కంప్లీట్ అయ్యాక.. ఇంటర్నెట్(Internet) 40కేబీపీఎస్(KBPS) వేగంతో పని చేస్తుంది.

మరో ప్లాన్ చూసినట్లైతే.. 87 రూపాయలది ఒకటి. ఇది రోజు 1 జీబీ డేటా లభిస్తోంది. 14 రోజులు వాలిడిటీ ఉంటుంది. కాగా మొత్తం 14 జీబీ వస్తుంది. అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్ మాట్లాడుకోవచ్చు. అలాగే హార్డీ మొబైల్ గేమ్‌ల సేవ కూడా అందుబాటులో ఉంటుంది.

97 రూపాయలతో వచ్చే మరో ప్లాన్ రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. 15 రోజులు వాలిడిటీ ఉంటుంది. ఈ ప్లాన్‌లో అపరిమిత లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్‌లు ఉంటాయి. దీంతో పాటు రూ. 98 తో ప్రీపెయిడ్ ప్లాన్ లో ప్రతిరోజు 2 జీబీ డేటా వస్తుంది. 18 రోజులు ప్లాన్ వాలిడిటీ.

రూ.94 ప్రీపెయిడ్ ప్లాన్‌లో 3 జీబీ డేటా అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ 30 రోజుల వాలిడిటీ. ఈ ప్లాన్ లోకల్, STD కాల్స్ కోసం 200 నిమిషాల కాలింగ్ సదుపాయాన్ని అందిస్తుంది.

Advertisement

Next Story