- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Brahmamudi: ధాన్యం దగ్గరకి వెళ్లి కొత్త బట్టలు పెట్టిన కొడుకు, కోడలు
దిశ, వెబ్ డెస్క్ : బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్
" అప్పూ నువ్వు అవకాశం దొరికినప్పుడల్లా మా వాళ్ళతో మాట్లాడితే నువ్వు ఏంటో వాళ్లు తెలుసుకుంటారు.. పదా వెళ్దాం " అని కవి అంటాడు. " అది కాదురా భయ్ అని అప్పూ ఏదో చెబుతుంటే .. ఇంకేం చెప్పకు.. వేలితో అప్పూ నోటిపై అడ్డం పెట్టి.. ‘ ఏం మాట్లాడకు పదా వెళ్దాం’ అని ఇద్దరూ వెళ్తారు. ధాన్యం, ప్రకాశం హాల్లో ఉంటే వాళ్ల దగ్గరకు వెళ్తారు. " అమ్మా నా మొదటి సంపాదనతో మీకు బట్టలు తీసుకొన్నాను’ అంటూ చీర తీసి ధాన్యలక్ష్మీ ముందు పెడతాడు కవి.
ఆ బట్టలు తీసుకుని కళ్లనిండా నీళ్లతో చూస్తుంది ధాన్యం. అప్పడే అక్కడికి వచ్చినా ఇందిరా దేవి, అపర్ణా దేవి వచ్చి.. " తీసుకో ధాన్యలక్ష్మీ.. నీ కొడుకు తీసుకొచ్చి ఇస్తున్నాడుగా .. అలాంటివి అందుకోవాలన్నా కూడా అదృష్టం కూడా ఉండాలి " అని చెబుతుంటారు. దాంతో, ధాన్యం కూడా కవి ఇచ్చిన చీరను తీసుకుంటుంది . ఇక మావయ్య ఫ్యాంట్ షర్ట్.. తెచ్చి అప్పూకీ ఇస్తాడు. తర్వాత, ఇద్దరూ ఆశీర్వాదం తీసుకుంటారు. ఇక ఇందిరా దేవి.. " మరి మీరు కూడా కొన్నారుగా ఆ బట్టలు వాళ్లకి ఇవ్వండి’ అంటుంది. " నా కొడుక్కే తీసుకున్నాను.. ఆవిడ గారు ఫ్యాంట్ షర్ట్ కట్టుకుంటుందో.. చీర కట్టుకుంటుందో తెలియక నేను ఏదీ తీసుకోలేదు’ అని ధాన్యం అంటుంది. ఇక్కడితో ఈ సీన్ ముగుస్తుంది.
- Tags
- Brahmamudi