MLA Sanjay Kumar, ఎమ్మెల్సీ రమణకు నిరసన సెగ

by Sathputhe Rajesh |   ( Updated:2022-07-16 10:16:54.0  )
Bornapally Villagers Stopped MLA Sanjay Kumar, MLC Ramana
X

దిశ, రాయికల్: Bornapally Villagers Stopped MLA Sanjay Kumar, MLC Ramana| మండలంలోని బోర్నపల్లి గ్రామంలో అకాల వర్షం వల్ల దెబ్బతిన్న ఇండ్లకు నష్టపరిహారం అందించేందుకు శనివారం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తో పాటు ఎమ్మెల్సీ ఎల్.రమణ బోర్నపల్లి గ్రామంలో పర్యటించే సమయంలో గ్రామస్తులు 30 నిమిషాల పాటు నిరసన తెలుపుతూ మురికి కాలువల నిర్మాణం చేపడతామని గ్రామానికి మూడుసార్లు వచ్చి కొబ్బరికాయలు కొట్టి వెళ్లారు కానీ ఇప్పటివరకు మీరు చేసిందేమీ లేదని,మురికి కాలువల నిర్మాణం ఎప్పుడు చేపడతారో చెప్పాలంటూ ప్రశ్నించారు...? కరోనా వల్ల అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిందని త్వరలోనే మురికి కాలువ నిర్మాణం పనులు ప్రారంభిస్తారని ఎమ్మెల్యే సర్ది చెప్పడంతో ఆందోళన విరమించారు.

ఇది కూడా చదవండి: కాసేపట్లో వరంగల్‌కు బయలుదేరనున్న సీఎం కేసీఆర్?

Next Story

Most Viewed