- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రముఖ గేయ రచయిత కందికొండ జీవిత ప్రస్థానం
దిశ, నర్సంపేట : ప్రముఖ గేయ రచయిత, కవి కందికొండ కన్నుమూశారు. క్యాన్సర్ చికిత్సలో భాగంగా కీమో థెరపీ చేయడంతో కందికొండ స్పైనల్ కాడ్ దెబ్బతింది. ఈ నేపథ్యంలో అతని ఆరోగ్యం మరింత క్షీణించింది. అతని స్వగ్రామమైన నర్సంపేట మండలంలోని నాగుర్లపల్లి గ్రామంలో శనివారం సాయంత్రం కన్నుమూశారు.
ఇంటిపేరే అసలు పేరుగా...
రచయిత కందికొండ పూర్తి పేరు కందికొండ యాదగిరి. కానీ యావత్ సినీ ప్రపంచానికి కందికొండగానే సుపరిచితం. వరంగల్ జిల్లాలోని నర్సంపేట మండలం నాగుర్లపల్లి అనే చిన్న గ్రామంలో కందికొండ జన్మించారు. ప్రాథమిక విద్య సొంతూళ్లోనే సాగింది. హైస్కూల్ చదువు నర్సంపేటలో పూర్తి చేశాడు. ఎక్కువగా సినిమాలు చూసే అలవాటు ఉన్న కందికొండ లైబ్రరీకి కూడా వెళ్ళేవాడు. ఇంటర్ చదువు కోసం మానుకోట వెళ్లాల్సి వచ్చింది. డిగ్రీ కూడా మహబూబాబాద్ లోనే పూర్తి చేశాడు. అక్కడే చిత్ర దర్శకుడు చక్రితో ఇతనికి పరిచయం ఏర్పడింది. ఇక్కడే సాహితీ కళాభారతి సాంస్కృతిక సంస్థ ఏర్పాటైంది. మానుకోటలో మొదలైన కందికొండ పాటల ప్రయాణం క్రమక్రమంగా సినిమా రంగం వైపు నడిపించింది.
కందికొండ రాసిన పాటలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు చరిత్రకు అద్దం పట్టేలా ఉంటాయి. సినీ రంగంలో తనకంటూ ప్రత్యేకతను చాటుతూ దూసుకెళ్తున్న కందికొండకి క్యాన్సర్ రూపంలో అడ్డుకట్ట పడింది. 2012లో మొదటగా గొంతు క్యాన్సర్ కందికొండకు ఎటాక్ అయింది. సరైన చికిత్స అందించడంతో దాదాపుగా ఆరేండ్ల వరకు ఆరోగ్య సమస్య పెద్దగా ఉత్పన్నం కాలేదు. 2019లో మరోసారి కందికొండను క్యాన్సర్ ఎటాక్ చేసింది. పలుమార్లు కీమో థెరపీ చేయాల్సి రావడంతో అతని ఆరోగ్యం విషమించింది. దానికి తోడు స్పైనల్ కాడ్ సమస్య రావడం, ఆపై ఆర్థిక సమస్యలు అతని ఆరోగ్యాన్ని మరింత విషమించేలా చేశాయి. ఇంటి దగ్గరే చికిత్స తీసుకుంటున్న కందికొండ ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో కన్నుమూశారు. ఎన్నో పాటలను రాసిన కందికొండ తెలంగాణ సంస్కృతి, యాసను ప్రపంచానికి పరిచయం చేశాడు. అతని మృతితో నర్సంపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి.