ఎట్టకేలకు ప్రేమించిన వాడితో ఏడడుగులు వేసిన బిగ్‌బాస్ బ్యూటీ.. లొకేషన్ అదిరిందిగా అంటున్న నెటిజన్లు(పోస్ట్)

by Kavitha |
ఎట్టకేలకు ప్రేమించిన వాడితో ఏడడుగులు వేసిన బిగ్‌బాస్ బ్యూటీ.. లొకేషన్ అదిరిందిగా అంటున్న నెటిజన్లు(పోస్ట్)
X

దిశ, సినిమా: తమిళ నటి, బిగ్‌బాస్ ఫేమ్ రమ్య పాండియన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ అమ్మడు ‘డమ్మీ టపాసు’, ‘జోకర్‌’, ‘రామే ఆండాళుమ్‌ రావణే ఆండాళుమ్‌’ వంటి తమిళ చిత్రాల్లో నటించింది. అలాగే ‘కూకు విత్‌ కోమలి’ షోతో పాపులర్‌ అయింది. ఈ షోలో మొదటి సీజన్‌లో పాల్గొన్న ఆమె సెకండ్‌ రన్నరప్‌గా నిలిచింది. అలాగే తమిళ ‘బిగ్‌బాస్‌’ నాలుగో సీజన్‌లో తన గేమ్‌తో టాప్‌ 5లో చోటు దక్కించుకుంది. తర్వాత బిగ్‌బాస్‌ అల్టిమేట్‌ షోలో పాల్గొనగా సెకండ్‌ రన్నరప్‌గా నిలిచింది.

ఇదిలా ఉంటే.. గతేడాది బెంగళూరులో యోగా శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రమ్య అక్కడ యోగా నిపుణుడైన లోనన్ ధావన్‌తో ప్రేమలో పడింది. ఇక ఇన్ని రోజులు లవ్ చేసుకున్న ఈ జంటను పెద్దలు కూడా ఆశీర్వదించడంతో తాజాగా ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ఇక ఈ వివాహం ఉత్తరాఖండ్‌లోని రిషికేష్ వేదికగా నిలిచింది. అయితే తాజాగా ఈ ప్రేమజంట తమ పెళ్లి ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా అవి కాస్తా వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన సెలబ్రిటీలు, అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే పెళ్లి చేసుకున్న లొకేషన్‌ కూడా అదిరిందని కామెంట్లు చేస్తున్నారు. కాగా బంధుమిత్రులు, సెలబ్రిటీల కోసం చెన్నైలో నవంబర్‌ 15న రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు.

Advertisement

Next Story