- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bhagyashri Borse: తెలుగులో బంపర్ ఆఫర్ అందుకున్న భాగ్య శ్రీ బోర్సే.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ విడుదల
దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే(Bhagyashri Borse) ‘యారియాన్-2’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఇక తెలుగులో రవితేజ(Ravi Teja) ‘మిస్టర్ బచ్చన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ హిట్ కాకపోయినా భాగ్యశ్రీ తన అందం అభినయంతో మాత్రం ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. తాజాగా, ఈ అమ్మడు తెలుగులో మరో బంపర్ ఆఫర్ అందుకుంది. టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni) ‘రాపో-22’(Rapo-22) చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు మేకర్స్.
ఆమె ఫొటోను షేర్ చేస్తూ పూజా కార్యక్రమంతో జర్నీ స్టార్ కాబోతున్నట్లు తెలిపారు. అయితే ఈ సినిమాను డైరెక్టర్ మహేష్ బాబు(Mahesh Babu) తెరకెక్కిస్తుండగా.. నవీన్ యర్నేనీ, రవిశంకర్ మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers) బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది. భారీ అంచనాల నడుమ రాబోతున్న ‘రాపో-22’తో హిట్ అందుకోవాలని రామ్ పోతినేని ఎదురు చూస్తున్నారు.
The recent sensation #BhagyashriBorse joins #RAPO22 adding her charm and brilliance to the beautiful journey ❤️🔥
— Mythri Movie Makers (@MythriOfficial) November 20, 2024
The journey begins with the pooja ceremony tomorrow ✨
Stay tuned!
Starring @ramsayz
Written and directed by @filmymahesh
Produced by @MythriOfficial.#RAPO pic.twitter.com/9XehPKydAO