- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Srikanth Odela: లీక్‌ల విషయంలో వారిని బ్లేమ్ చేయడం మానేస్తే బెటర్.. డైరెక్టర్ సెన్సేషనల్ ట్వీట్
దిశ, సినిమా: టాలీవుడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో నాని హీరోగా వచ్చిన ‘దసరా’(Dasara) మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ హిట్ కాంబో రిపీట్ అవుతోంది. ‘నాని, ఓదెల-2’ అనే వర్కింట్ టైటిల్‌తో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమాకు పెట్టిన టైటిల్ లీక్ అయింది. ఈ నేపథ్యంలో మేకర్స్ అలర్ట్ అయి..‘నాని, ఓదెల-2’ చిత్రానికి ‘ది పారైడైజ్’(The Paradise) అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు.
తాజాగా, శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) తన సినిమా టైటిల్‌ను లీక్ చేయడంపై ‘X’ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఇది ఎవరికి సంబంధించినది అయితే వారి కోసం, నా సినిమాకే కాదు ఎవరి చిత్రానికి ఏ లీక్ అయినా అసిస్టెంట్ డైరెక్టర్స్(Directors), రైటర్స్‌ను బ్లేమ్ చేయడం మానేస్తే బెటర్. వాళ్లు భవిష్యత్తులో సినిమా కోసం ఎన్నో అద్భుతాలు(miracles) చేయగల సృష్టికర్తలు. మూవీకి వాళ్ళు పెట్టె నిస్వార్థమైన కష్టానికి అత్యంత గౌరవం ఇవ్వాలి. కష్టపడి పనిచేసే సినిమా విభాగాలపై నిందలు వేసే అలవాటును మార్చుకోండి. మీ అత్యాశను అంగీకరించడం నేర్చుకోండి. నా సినిమా టైటిల్‌ను లీక్ చేసిన బాస్టర్డ్స్ నాకు తెలుసు. వాళ్లు నా టీమ్‌కు చెందినవారు కాదు’2 అని రాసుకొచ్చారు.
To whomever it may concern,
— Srikanth Odela (@odela_srikanth) November 10, 2024
నా సినిమాకే కాదు, ఎవరి సినిమా లో ఏ లీక్ అయినా ASSISTANT DIRECTORS or WRITERS ని blame చేయడం మానేస్తే better.
These people are the future creators and their selfless contribution to cinema deserves utmost RESPECT!
Change the habit of blaming it on… pic.twitter.com/xoO3gLCANp