ఈ పువ్వును ఎప్పుడైనా తిన్నారా...? తింటే చాలా లాభాలుంటాయి

by S Gopi |
ఈ పువ్వును ఎప్పుడైనా తిన్నారా...? తింటే చాలా లాభాలుంటాయి
X

దిశ, వెబ్ డెస్క్: కొబ్బరి పువ్వును మనం అరుదుగా చూస్తుంటాం. దేవుడి వద్ద కొబ్బరికాయ కొట్టినప్పుడు అప్పుడప్పుడు ఆ కొబ్బరిలో పువ్వు కనిపిస్తూ ఉంటుంది. దీనిని శుభసూచకంగా భావిస్తుంటారు. అయితే, ఈ పువ్వును మార్కెట్ లో విక్రయిస్తుంటారు. ఇది తింటే ఎన్నో లాభాలు ఉంటాయి. ఎందుకంటే కొబ్బరి పువ్వులో చాలా పోషకాలు ఉంటాయి. ఈ విషయం చాలా మందికి తెలియదు. దీనిని ఎక్కువగా చెన్నైలో విరివిగా విక్రయిస్తుంటారు. ఏపీలో కూడా పలు చోట్ల విరివిగా విక్రయిస్తుంటారు. ఒక్కో పువ్వు ధర రూ. 50 నుంచి 100 వరకు ఉంటుంది. వీటిని తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవేమిటంటే.. కొబ్బరి పువ్వు తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నీరసం, అలసట వంటి సమస్యలను దూరం చేస్తుంది. కిడ్నీ సమస్యల నుంచి కూడా కాపాడుతుంది. క్యాన్సర్ వంటి సమస్యలు దరి చేరకుండా నివారించగలుగుతుంది. అంతేకాదు.. చర్మ సమస్యలు కూడా దరి చేరకుండా చేసి చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది.





Advertisement

Next Story