- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జ్యోతిష్యుడు చెబితే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లొచ్చు: మురళీధర్‌రావు
దిశ, తెలంగాణ బ్యూరో : మంత్రి కేటీఆర్‌ను కేసీఆర్ముఖ్యమంత్రి గా చేయడని బీజేపీ జాతీయ నేత మురళీధర్‌రావు మీడియా చిట్‌చాట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రెస్ మీట్అనంతరం ఆయన చిట్‌చాట్‌లో పలు అంశాలను వెల్లడించారు. జాతీయ రాజకీయాల్లో తిరగడానికి కేసీఆర్ కు సీఎం పదవి అవసరమని, అందుకే కేటీఆర్ కు ఆ బాధ్యతలు అప్పగించడని ఆయన పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ జ్యోతిష్యుడు చెబితే ముందస్తుకు వెళ్లే అవకాశాలు ఉండొచ్చని ఎద్దేవా చేశారు. ఢిల్లీకి, తెలంగాణకు మధ్య బీజేపీ నేతల్లో ఎలాంటి గ్యాప్ లేదని, ఢిల్లీ - పశ్చిమ బెంగాల్ తరహాలో ఢిల్లీ-తెలంగాణ మధ్య వార్ క్రియేట్ చేయాలని కేసీఆర్ చూస్తున్నారని, అది అసాధ్యమని మురళీధర్‌రావు తెలిపారు.
అదే ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ.. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరించే అవకాశాలు తక్కువగా ఉంటాయని, దానివల్ల తెలంగాణ-ఏపీ మధ్య గ్యాప్ ఉండే అవకాశాలున్నట్లు వెల్లడించారు. నిరుద్యోగ నోటిఫికేషన్ల భర్తీకి ఏడాది సమయం పట్టే అవకాశమున్న నేపథ్యంలో అప్పటి వరకు ఖాళీలు భర్తీ చేస్తే కొంత వ్యతిరేకత తగ్గించుకోవచ్చని టీఆర్ఎస్ భావిస్తోందన్నారు. కాశ్మీర్ ఫైల్స్ సినిమా ఇండస్ట్రీలో బాహుబలి లాంటి రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రాంతీయ భాషల్లో కాశ్మీర్ ఫైల్స్ సినిమా రాబోతోందని మురళీధర్‌రావు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మాత్రం కచ్చితంగా తాను పోటీ చేస్తానని, అయితే అది ఎంపీ స్థానమా? ఎమ్మెల్యే స్థానమా అనేది ఇప్పుడే చెప్పలేనని పేర్కొన్నారు.