- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
షాకింగ్ డెసిషన్ తీసుకున్న టెన్నిస్ ప్లేయర్.. 25 ఏళ్ల వయసులోనే..
న్యూఢిల్లీ : ప్రస్తుత వరల్డ్ నం.1, ఆస్ట్రేలియా మహిళా టెన్నిస్ ప్లేయర్ యాష్లే బార్టీ షాకింగ్ డెసిషన్ తీసుకుంది. 25 ఏళ్ల బార్టీ అనూహ్యంగా ఆటకు రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. 'ఈ రోజు నేను తీసుకున్న కఠిన నిర్ణయం వల్ల నా మనసు భావోద్వేగాలతో నిండిపోయింది. టెన్నిస్‌కు వీడ్కోలు పలుకుతున్నా. టెన్నిస్ నాకెంతో ఇచ్చింది. అందుకు నేను టెన్నిస్‌కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటా. నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతున్నా' అని బార్టీ పేర్కొంది.
అయితే, ఈ నిర్ణయం పట్ల తాను ఆనందంగానే ఉన్నానని, ఇదే సరైన సమయమని భావిస్తున్నానని తెలిపింది. 'నేను టెన్నిస్ వీడటానికి ఇదే సరైన సమయం. నా వరకైతే కెరీర్‌ను విజయవంతంగానే ముగించానని అనుకుంటున్నాను. ఇక, నేను మిగతా కలలపై దృష్టి పెడతాను' అని బార్టీ చెప్పుకొచ్చింది. బార్టీ తన కెరీర్‌లో మూడు మేజర్ టైటిల్స్ గెలుచుకుంది. 2019లో ఫ్రెంచ్ ఓపెన్, 2021లో వింబుల్డన్ గెలుచుకోగా.. ఈఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ దక్కించుకుంది. 44 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ గెలుచుకున్న ఆస్ట్రేలియా క్రీడాకారిణి బార్టీ నిలిచిన విషయం తెలిసిందే.
మొత్తంగా కెరీర్‌లో సింగిల్స్‌లో 15 టైటిల్స్, డబుల్స్‌లో 12 ట్రోఫీలు కైవసం చేసుకుంది. మహిళల విభాగంలో నం.1 క్రీడాకారిణి అత్యధిక రోజులు ఉన్న నాలుగో ప్లేయర్‌గా బార్టీ రికార్డు అందుకుంది. ప్రస్తుతం 121 వారాల నుంచి ఆమె అగ్ర స్థానంలో కొనసాగుతోంది. స్టెఫీ గ్రాఫ్ (186 వారాలు), సెరెనా విలియమ్స్ (186 వారాలు), మార్టినా నవ్రతిలోవా (156 వారాలు) ముందు వరుసలో ఉన్నారు. మహిళల విభాగంలో వరల్డ్ నం.1 లో కొనసాగుతున్న బార్టీ.. అనూహ్యంగా ఆటకు వీడ్కోలు పలకడం టెన్నిస్ లోకాన్ని ఆశ్చర్యపరచింది. ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్‌తోపాటు టెన్నిస్ క్రీడాకారులు స్పందించారు. బార్టీతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ట్వీట్లు చేశారు.