- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Anushka Shetty: ఫెయిల్యూర్ డైరెక్టర్‌తో అనుష్క శెట్టి పెళ్లి..? దుమారం రేపుతున్న న్యూస్
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సూపర్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. నేడు అనేక సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన ‘బాహుబలి’ 1,2 లలో నటించి పాన్ ఇండియా హీరోయిన్ రేంజ్‌కి ఎదిగింది. ఆ తర్వాత ‘నిశ్శబ్దం’, ‘భాగమతి’, ‘సైజ్ జీరో’ లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. సైజ్ జీరో సినిమా తర్వాత ఇండస్ట్రీకి దూరమైన ఈ బ్యూటీ.. గత ఏడాది ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ మూవీలో నటించింది. అయితే ఈ మూవీ అనుకున్నంత హిట్ కాలేకపోయింది. దీంతో ప్రస్తుతం సెలక్టివ్‌గా పాత్రలు ఎంచుకుంటూ దూసుకుపోతోంది. ఇందులో భాగంగా ‘ఘాటీ’, ‘కథనార్’ వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో మెప్పించడానికి రెడీ అవుతోంది. ఇక తాజాగా ఈ అమ్మడు బర్త్‌డే సందర్భంగా ‘ఘాటీ’ నుంచి విడుదలైన గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. అలాగే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది.
ఇదిలా ఉంటే.. గతంలో అనుష్క పెళ్లి చేసుకోబోతోంది అంటూ పలు పుకార్లు నెట్టింట షికార్లు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మారోమారు జేజమ్మ మ్యారేజ్ చేసుకోబోతుందని, అది కూడా ప్లాప్ డైరెక్టర్‌ను చేసుకోవడానికా సిద్ధమైందనే వార్తలు సోషల్ మీడియాలో కోడై కూస్తున్నాయి. ఇంతకీ ఆ డైరెక్టర్ మరెవరో కాదండోయ్ అత్యంత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి. వీరిద్దరూ గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ పుకారు షికారు చేస్తోంది. అయితే తాజాగా దీనిపై స్పందించిన అనుష్క..‘ వీటిల్లో ఏమాత్రం నిజం లేదు. నేను ఎవరిని, ఎక్కడ, ఎప్పుడు పెళ్లి చేసుకుంటానో కచ్చితంగా మీకు చెప్తాను. దయచేసి అప్పటి వరకు ఇలాంటి రూమర్స్‌ను స్ప్రెడ్ చేయకండి’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.