- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ సినిమా చూడాలంటూ యువకుల బైక్ ర్యాలీ.. వీడియో వైరల్
దిశ, సినిమా: భారతదేశంలో ప్రస్తుతం 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా హాట్ టాపిక్‌గా మారింది. అనేక ఒడిదొడుకులు, బెదిరింపుల మధ్య మార్చి 11న రిలీజైన ఈ చిత్రాన్ని నరేంద్ర మోడీ అభినందించిన తర్వాత మరింత ఆదరణ పెరిగింది. సినిమాలో కశ్మీర్ చరిత్రను నిర్భయంగా ఉన్నది ఉన్నట్లు తెరకెక్కించడంతో భావోద్వేగానికి లోనవుతున్న కశ్మీర్ పండిట్ల కుటుంబాలు, సెలబ్రిటీలు, రాజకీయనాయకులు డైరెక్టర్‌తో పాటు చిత్ర బృందాన్ని అభినందిస్తున్నారు. ఈ క్రమంలోనే నటుడు అనుపమ్‌కేర్ ఓ ప్రత్యేక ట్వీట్ అభిమానులతో పంచుకున్నాడు. 'నీలిరంగు పూసుకుని శివుడిలా తయారైన భారతీయ యువకులు 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా చూడమని ప్రజలను కోరడం అద్భుతంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాదులు వేధించిన ప్రజలను ఈ చిత్రం ఒక్కటి చేస్తోంది. ఈ సినిమా ఇప్పుడు ఓ ఉద్యమంలా నడుస్తోంది. ధన్యవాదాలు' అంటూ ట్విట్‌లో రాసుకొచ్చిన ఆయన.. బైక్‌పై ర్యాలీ చేస్తున్న యువకుల వీడియోను షేర్ చేయగా ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
It is wonderful to see young Indians made up as #Shiva in blue urging people to watch #TheKashmirFiles!This time it is #Pain of the victims of terrorism anywhere in the world that is connecting people. The film is a movement now. Thank you! 🙏💔#PowerOfCinema #TheKashmirFiles pic.twitter.com/ZM9O5uSgYL
— Anupam Kher (@AnupamPKher) March 16, 2022