- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమెరికాలో ఆర్ఆర్ఆర్ క్రేజ్.. మొదటి ఇండియన్ సినిమాగా రికార్డు!
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం టాలీవుడ్‌లో సినిమాల సందడి మొదలయ్యింది. ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అటు ఎన్టీ ఆర్ ఫ్యాన్స్, ఇటు రామ్ చరణ్ ఫ్యాన్సే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఈ సినిమా కోసం వేయిట్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడి అభిమానులను నిరాశ పరిచిన చిత్ర యూనిట్ ఈ సారి మార్చ్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి రెడీ అయ్యింది. ఈ క్రమంలో సినిమాపై బారీగా అంచనాలు పెరుగుతున్నాయి.
ఇక్కడే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఈ సినిమాకు ఉన్న క్రేజ్ చెప్పలేనిది. ఇక అమెరికాలో ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదలకు చిత్రబృదం భారీ ఎత్తున సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే అమెరికాలో ఆర్ఆర్‌ఆర్ సినిమాను విడుదల చేస్తున్న డిస్ట్రిబ్యూటర్ సరిగమ సినిమాస్ తాజాగా ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. అమెరికాలో ఉన్న ఆడియన్స్ సిద్ధంగా ఉండండి. రేపు (ఆదివారం) మీకోసం సరిగమ సినిమాస్, రాఫ్తార్ క్రియేషన్స్ నుంచి ఎగ్జైట్‌మెంట్ ప్రకటన రానుంది. ఇది ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమా కూడా అందుకోలేని అరుదైన విశేషం' అంటూ రాసుకొచ్చారు. దీంతో అభిమానుల్లో ఒక్కసారిగా ఉత్సాహాం రెట్టింపు అయ్యింది. ఇక అరుదైన విశేషం ఏమిటి, అమెరికాలో ఏ భారతీయ సినిమా సాధించని ఆ ఘనత ఏంటో తెలుసుకునేందుకు ప్రేక్షులందరూ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.