- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Amaran Movie: సాయిపల్లవి కామెంట్స్ ఎఫెక్ట్.. అమరన్ సినిమా చూడొద్దని నెట్టింట ట్రోలింగ్.. అసలేం జరిగింది ?
దిశ, వెబ్ డెస్క్: సాయిపల్లవి - శివ కార్తికేయన్ జంటగా నటించిన సినిమా అమరన్ (Amaran). ఈ సినిమా దీపావళి (Diwali 2024) కానుకగా అక్టోబర్ 31న రిలీజ్ కానుంది. సినిమా నుంచి విడుదల చేసిన "హే రంగులే" పాటొక్కటే (Hey Rangule Song) బిగ్ హైప్ తెచ్చిందనడంలో సందేహం లేదు. ఎవరి ప్లే లిస్ట్ చూసినా.. ఈ సాంగ్ టాప్ ప్లేస్ లో ఉండటం కన్ఫర్మ్. దాదాపుగా థియేటర్లు ఫుల్ అయ్యాయి. మేజర్ ముకుంద్ వరదరాజన్ నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రమోషన్స్ కూడా పూర్తి చేసుకున్న అమరన్ కు నెటిజన్ల నుంచి షాక్ తగిలింది. సాయిపల్లవిపై నెగిటివ్ ట్రోలింగ్ (#BoycottSaiPallavi) జరుగుతోంది. విరాటపర్వం (Virataprvam) సినిమా రిలీజ్ సమయంలో ఆమె ఇండియన్ ఆర్మీని పాకిస్థాన్ ఆర్మీ చూసే దృష్టిపై కామెంట్స్ చేసింది. వాటినే ఇప్పుడు నెగిటివ్ గా చూపిస్తూ ట్రోల్స్ చేస్తున్నారు.
అసలు సాయిపల్లవి ఏం కామెంట్స్ చేసింది?
పాకిస్తానీలకు ఇండియన్ ఆర్మీ (Indian Army) టెర్రరిస్టుల్లా, ఇండియన్స్ కు పాక్ సైన్యం టెర్రరిస్టుల్లా కనిపిస్తుందని మాట్లాడిన చిన్న క్లిప్ వైరల్ అవుతోంది. అదే ఇంటర్వ్యూలో కశ్మీరీ పండిట్ల హింసపై కూడా సాయిపల్లవి కామెంట్స్ చేసింది. కశ్మీరీ పండిట్లపై (Kashmiri Pandits) జరిగిన హింసకు, కోవిడ్ (covid-19) సమయంలో వాహనంలో ఆవును తీసుకెళ్తున్న ముస్లిం డ్రైవర్ పై జరిగిన హింసకు తేడా ఏముందన్నారు. దీంతో సోషల్ మీడియా ఆమె వ్యాఖ్యల్ని వక్రీకరించింది. ఆవుల స్మగ్లింగ్, కశ్మీరీ పండిట్లపై జరిగిన దారుణం ఒక్కటేనంటున్న సాయిపల్లవి.. బాలీవుడ్ లో సీత క్యారెక్టర్ లో ఎలా నటిస్తోందని @profesorsahab ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఆమె నటించిన సినిమాలను బహిష్కరిస్తామని హిందూ ఐటీ సెల్ ఎక్స్ లో తెలిపింది. ఇలా చాలా మంది సాయిపల్లవి వ్యాఖ్యల్ని తప్పుపడుతుండగా కొందరు మాత్రం ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.
నిజానికి సాయిపల్లవి (Saipallavi) భారతసైన్యంపై ఎలాంటి తప్పు వ్యాఖ్యలు చేయలేదంటున్నారు గాయని చిన్మయి శ్రీపాద, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు. ఆమె పాకిస్తానీయుల కోణం ఎలా ఉంటుందో చెప్పారు గానీ.. ఇండియాకు వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు. ఈ వీడియోలను ట్రోల్ చేస్తూ.. ఆమె సినిమాలను చూడకూడదని, సీతపాత్రలో నటించకూడదని చెప్పడం సబబు కాదని అభిప్రాయపడ్డారు.