లక్కీ ఛాన్స్ కొట్టేసిన బన్నీ.. సంజయ్ లీలా భన్సాలీతో ఫిల్మ్..?

by Harish |
లక్కీ ఛాన్స్ కొట్టేసిన బన్నీ.. సంజయ్ లీలా భన్సాలీతో ఫిల్మ్..?
X

దిశ, సినిమా : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించాడు. సినీ సెలబ్రిటీస్, క్రికెట్ స్టార్స్ సైతం 'తగ్గేదేలే' అనే డైలాగ్‌తో నెట్టింట రచ్చ చేస్తూ.. బన్నీ పై ప్రశంసల వర్షం కురిపించారు. తన స్టైల్, యాక్టింగ్‌కు ఫిదా అయిపోయామని కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఈ క్రమంలో బన్నీ.. లెజెండరీ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీని కలవడం హాట్ టాపిక్ అయిపోయింది. భన్సాలీ ఆఫీస్‌లో అల్లు అర్జున్ దాదాపు రెండు గంటలపాటు స్పెండ్ చేయడంతో వీరిద్దరి కాంబినేషన్‌లో ప్రాజెక్ట్ కన్‌ఫర్మ్ అయిందేమోననే చర్చ జరుగుతోంది. అయితే మ్యాటర్ అది కాదని, జస్ట్ క్యాజువల్ మీటింగ్ అయి ఉంటుందని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed