'వరి ధాన్యాన్ని తక్షణమే కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి'

by Vinod kumar |
వరి ధాన్యాన్ని తక్షణమే కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి
X

దిశ, వెబ్ డెస్క్: రైతు పండించిన ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఏఐకేఎంఎస్ జాతీయ అధ్యక్షుడు వేములపల్లి వెంకటరామయ్య డిమాండ్ చేసారు. మంగళవారం అఖిల భారత రైతు కూలీ సంఘం (AIKMS) తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు వి. కోటేశ్వరరావు అధ్యక్షతన మార్క్స్ భవన్ హైదరాబాద్ లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఐకేఎంఎస్ జాతీయ అధ్యక్షుడు వేములపల్లి వెంకటరామయ్య మాట్లాడుతూ..ప్రత్యేకంగా రాష్ట్రంలో రైతులు పండించే వరి ధాన్యాన్ని సేకరించడంలో కేంద్ర, రాష్ట ప్రభుత్వాల రాజకీయాలతో రైతులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై బలమైన ఉద్యమాలు చేపట్టవలసిందిగా పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి మండల వెంకన్న, డేవిడ్ కుమార్, అకుల పాపయ్య, లాల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్.కె.యం.) ఏప్రిల్ 11 నుంచి 17 వరకు కనీస మద్దతు ధరల గ్యారెంటీ చట్టం ను డిమాండ్ చేస్తూ.. ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలనే పిలుపుతో సహా రాష్ట్రంలో రైతాంగం, వ్యవసాయ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలు చర్చించామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed