కూలీలకు భలే గిరాకీ..!

by S Gopi |
కూలీలకు భలే గిరాకీ..!
X

దిశ, ఝరాసంగం: గత వారం రోజులుగా కురిసిన వర్షానికి పంట పొలాల్లో విపరీతమైన గడ్డి, పిచ్చి మొక్కలు మొలవడంతో చిన్న, సన్నకారు రైతులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. ఖరీఫ్ సీజన్ లో పండించే ప్రధాన పంటలైన పత్తి, సోయాబిన్, కంది, పెసర, మినుము మొదలవు పంటపొలాల్లో తీవ్రమైన పిచ్చిమొక్కలు మొలవడంతో మొలిచాయి. దీంతో కలుపు తీసేందుకు కూలీల కొరత తీవ్రంగా ఏర్పడింది. ఝరాసంగం మండలంలోని బర్దిపూర్, దేవరపల్లి, ఏడాకులపల్లి, కుప్పానగర్, పొట్టిపల్లి, ఎల్గోయి, జీర్లపల్లి, మేదపల్లి, ఈధులపల్లి, కృష్ణాపూర్, మచునూర్ తదితర గ్రామాలలో కూలీల కొరత తీవ్రంగా ఉంది. దీంతో చేసేదేమీలేక ఇతర మండలాలైన జహీరాబాద్, కోహీర్, మొగుడంపల్లి ప్రాంతాల నుండి కూలీలను తరలించి కలుపు మొక్కలను తీస్తున్నారు. కూలీలు రోజుకు రూ. 700 నుండి 800 రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నట్టు తెలిసింది. కూలీల కొరత ఏర్పడడానికి కారణాలు ఏంటని వ్యవసాయ అధికారులను కోరగా పంట వేశాక 25 రోజుల లోపు కలుపు తీయాలని లేదా గడ్డిమందు పిచికారి చేయాలని వ్యవసాయ అధికారులు పేర్కొన్నారు. అయితే ఇలా చేయని రైతులకు వర్షాల కారణంగా పిచ్చి మొక్కలు, గడ్డి పెరిగిందని, దీంతో కూలీల కొరత ఏర్పడిందని వారు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed