Lokesh Kanagaraj: 5 ఏళ్ల తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ ‘ఖైదీ’ మూవీకి సీక్వెల్.. లోకేష్ ట్వీట్ వైరల్

by Hamsa |   ( Updated:2024-10-26 14:30:44.0  )
Lokesh Kanagaraj: 5 ఏళ్ల తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ ‘ఖైదీ’ మూవీకి సీక్వెల్.. లోకేష్ ట్వీట్ వైరల్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj), కార్తీ (Karthi )కాంబోలో తెరకెక్కిన ‘ఖైదీ’(Khaidi ) మూవీ వచ్చిన విషయం తెలిసిందే. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్‌తో వచ్చిన ఈ సినిమా 2019లో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమా రిలీజ్ అయి 5 ఏళ్లు పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) ‘X’ వేదికగా ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘అంతా ఇక్కడి నుంచే ప్రారంభమైంది. కార్తీ, ఎస్‌ఆర్ ప్రభులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీరి వల్ల లోకేష్ యూనివర్శల్(Lokesh Universal) సాధ్యమైంది. త్వరలోనే ఢిల్లీ తిరిగి రానున్నారు’’ అని రాసుకొచ్చారు. అంటే ‘ఖైదీ-2’ రాబోతున్నట్లు హింట్ ఇచ్చారు. ఇక ఈ విషయం తెలుసుకున్న కార్తీ (Karthi )అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Advertisement

Next Story