- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్యాయంపై ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్నామ్నాయమనే వ్యాఖ్యలపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆప్ కు జాతీయ స్థాయిలో ప్రత్నామ్యాయం గా ఎదగడానికి 15 నుంచి 20 ఏళ్లు పట్టవచ్చని చెప్పారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఆప్‌కు 2019 సాధారణ ఎన్నికల్లో కేవలం 27 లక్షల ఓట్లు మాత్రమే వచ్చాయన్నారు. అయితే 20 కోట్లకు పైగా ఓట్లు వచ్చినపుడు మాత్రమే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను చేరుకుంటుందని చెప్పవచ్చన్నారు. 'సిద్ధాంతపరంగా ఏ పార్టీ అయినా జాతీయ పార్టీ కావచ్చు. కానీ చారిత్రకంగా బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే దేశ స్థాయిలో పార్టీలుగా ఉన్నాయి. అయితే వేరే ఏ పార్టీ దీనిని చేరుకోలేదని కాదు. కానీ దీనికి 15-20 ఏళ్లు పట్టవచ్చు. ఇలాంటి మార్పులు కేవలం ఒక్క రాత్రిలో రావడం అసాధ్యం' అని అన్నారు. మరోవైపు పంజాబ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆప్ దేశవ్యాప్తంగా విస్తరించేందుకు పావులు కదుపుతుంది. దీనిలో భాగంగానే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లోనూ పోటీ చేయనున్నట్లు ప్రకటించింది.