రేప్ చేస్తుండగా ప్రతిఘటించడంతో ఆ రెండింటిపై పొడిచిన కామాంధుడు

by GSrikanth |   ( Updated:2022-07-16 06:28:34.0  )
రేప్ చేస్తుండగా ప్రతిఘటించడంతో ఆ రెండింటిపై పొడిచిన కామాంధుడు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు మాత్రం తగ్గడం లేదు. ఒంటరిగా దొరికితే చాలు అరాచకాలు చేస్తున్నారు. ఎదురు తిరిగితే దాడికి పాల్పడుతున్నారు. ప్రస్తుతం అలాంటి ఘటనే బీహార్‌లో చోటుచేసుకుంది. అత్యాచారం చేస్తున్న వ్యక్తిపై మహిళ తిరగబడటంతో ఆమె రెండు కళ్లల్లో పొడిచాడు ఓ నీచుడు. వివరాల్లోకి వెళితే..

కటిహార్ జిల్లాలో నివసిస్తున్న మహిళ(45) తన భర్త వేరే రాష్ట్రంలో పనిచేస్తుండగా తన 11 కుమార్తెతో ఉంటుంది. రాత్రి నిద్రపోతున్న సమయంలో పొరిగింటిలో ఉంటున్న మొహమ్మద్ షమీమ్ అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడి మహిళను ఎత్తుకు పోయాడు. అత్యాచారానికి పాల్పడుతుండగా పెనుగులాటలో మహిళపై దాడి చేశాడు. మేకు లాంటి పదునైనా వస్తువుతో ఆమె రెండు కళ్లల్లో అతి కిరాతకంగా పొడిచాడు. గమనించిన స్థానికులు వెంటనే ఆమెను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా.. పరిశీలించిన వైద్యులు రెండు కళ్లకు బాగా గాయాలు అయ్యాయని చెప్పారు. మెరుగైన వైద్యం కోసం కటిహార్‌లోని సదర్ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. ఆమె రెటీనా దెబ్బతిన్నాయని.. చూపు రావడం కష్టం అని చెప్పారు. సమాచారం అందుకున్న అహ్మదాబాద్ పోలీసులు బాధితురాలికి మెడికల్ టెస్టులు చేయించిన అనంతరం అత్యాచారం, హత్యాయత్నం కేసులు నమోదు చేశారు.

Advertisement

Next Story

Most Viewed