ఆ ఎమ్మెల్యేకు మంత్రి పదవి దక్కలేదని మహిళ ఆత్మహత్యాయత్నం..

by Satheesh |   ( Updated:2022-04-10 13:51:02.0  )
ఆ ఎమ్మెల్యేకు మంత్రి పదవి దక్కలేదని మహిళ ఆత్మహత్యాయత్నం..
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో క్యాబినెట్ విస్తరణ తీవ్ర దుమారం రేపుతోంది. మంత్రి పదవి దక్కని కొంత మంది ఎమ్మెల్యేల అభిమానులు రోడ్లెక్కి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా.. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మంత్రివర్గంలో చోటుకల్పించనందుకు ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. రెంటచింతల ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించిన ఆయన అభిమానులు.. రోడ్డుపై టైర్లు తగలపెట్టి రాస్తారోకో చేశారు. పాముల సంపూర్ణమ్మ అనే మహిళ మంటల్లో దూకి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చెయ్యగా.. వెంటనే తేరుకున్న కార్యకర్తలు ఆమెను అడ్డుకున్నారు. దీనితో పెను ప్రమాదం తప్పింది. ఇక వైసీపీ హైకమాండ్ పిన్నెల్లి రామ కృష్ణారెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చెయ్యగా.. ఆయన మీరూ, మీ ప్రభుత్వం చూపిన అభిమానానికి థాంక్స్ అంటూ ఫోన్ స్విచ్చాఫ్ చేసినట్టు సమాచారం.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed