- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆ గ్రామం గురించి ఆర్.నారాయణ మూర్తికి తెలిస్తే సినిమా తీయడం పక్కా!

ఆర్.నారాయణ మూర్తి సినిమాలు అంటే గుర్తొచ్చేది పేదలే. వారి జీవన విధానం, కష్టాలు, సమస్యలు, ఆకలి కేకలు, అణగదొక్కబడుతున్న విధానాలే కళ్లకు కనిపిస్తాయి. అచ్చం అలాగే ఉంది ఈ గ్రామం పరిస్థితి. ఓ వైపు 24 గంటల కరెంటు సరఫరా చేస్తున్నామంటూ ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటుంటే.. 15 ఏళ్ల క్రితం ఏర్పడిన ఈ గ్రామానికి నేటికీ విద్యుత్, తాగునీరు, రోడ్డు సౌకర్యాలు లేవు. బయటి ప్రపంచాన్ని చూడాలంటే చెట్లు, పుట్టల వెంట కిలోమీటర్ల కొద్ది ప్రయాణించాల్సిందే. ఈ రోజుకు కూడా కిరోసిన్‌తో వెలిగే గుడ్డి దీపాలతో రాత్రిళ్లను వెల్లదీస్తున్నారు. తెలంగాణలో నేటికీ కరెంట్ లేని గ్రామంగా నిలిచిన ఈ విలేజ్ గురించి మీరూ తెలుసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయాల్సిందే.
ఏపీ సచివాలయంలో ఇవాళ తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. భవనంలోని 2వ బ్లాక్‌లో ఉన్నట్టుండి మంటలు ఒక్కసారిగా చేలరేగాయి. దీంతో నైట్ డ్యూటీలో ఉన్న పోలీసులు గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందజేశారు. వారు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. భద్రతాధికారులు ప్రమాదానికి కారణాలు ఆరా తీస్తున్నారు. రెండో బ్లాక్ లోనే ఉప ముఖ్యమంత్రి పవన్, మంత్రులు అనిత, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, నారాయణ కందుల దుర్గేశ్ పేషీలు ఉన్నాయి. ఈ ఘటనపై చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఈ లింకులో చూడండి.
తెలంగాణలో సంచలనం సృష్టించిన న్యాయవాది గట్టు వామనరావు దంపతుల హత్య కేసులో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కేసుకు సంబంధించిన రికార్డులను 3 వారాల్లో అందజేయాలని ఆదేశించింది. న్యాయవాద దంపతుల హత్య అంశంపై సీబీఐ విచారణ జరపాలని వామనరావు కుమారుడు గట్టు కిషన్‌రావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ రాజేశ్ బిందాల్ ధర్మాసనం విచారణ జరిపింది. కేసుకు సంబంధించి రికార్డు అయిన వీడియోలతో సహా అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ తమ ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఈ లింక్‌లో చూడండి.
ఏపీలో బర్డ్స్ ఫ్లూ లక్షణాలతో చిన్నారి మృతి చెందిన ఘటనపై కేంద్రం రెస్పాండ్ అయింది. ఈ మేరకు కేంద్ర వైద్య బృందం విచారణ చేపట్టింది. నరసరావుపేటలో బర్డ్ ఫ్లూ లక్షణాలతో మృతి చెందిన చిన్నారి శాంపిల్స్ను పూణేలోని వైరాలజీ ల్యాబ్ కు పంపారు. నాలుగు రోజుల కిందట బర్డ్ ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో ఇవాళ ఉదయం నరసరావుపేటకు ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్సీడీసీ వైద్య బృందం చేరుకుంది. వాళ్లు ఎక్కడెక్కడ ఏం పరిశీలించారు? ఏ వివరాలు తెలుసుకున్నారో ఈ లింక్ లో తెలుసుకోండి.