రీరిలీజ్ కాబోతున్న సూపర్ స్టార్ హిట్ సినిమా.. బాధ్యతలు తీసుకోబోతున్నారంటూ నిర్మాత ట్వీట్

by Hamsa |
రీరిలీజ్ కాబోతున్న సూపర్ స్టార్ హిట్ సినిమా.. బాధ్యతలు తీసుకోబోతున్నారంటూ నిర్మాత ట్వీట్
X

దిశ, సినిమా: గత కొన్నేళ్ల నుంచి పలు చిత్రాలు రీరిలీజ్ అవుతూ బాక్సాఫీసును షేక్ చేస్తున్నాయి. అయితే కొన్ని సినిమాలు ఇంతకుముందు ఫ్లాప్ అయినప్పటికీ రీరిలీజ్‌లో దుమ్మురేపుతున్నాయి. ఇక స్టార్ హీరోల మూవీస్ అన్ని రీరిలీజ్ అవుతున్నాయి. పుట్టినరోజులకు లేదా పలు పండుగలకు హిట్, ఫ్లాప్ సినిమాలు మళ్లీ థియేటర్స్‌లో సందడి చేస్తున్నాయి. ఇప్పటికే రీరిలీజ్ అయిన చిత్రాలెన్నో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా, సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) నటించిన హిట్ మూవీ ‘భరత్ అనే నేను’(Bharat Ane Nenu)రీరిలీజ్ కాబోతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాత నట్టికుమార్ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ఏప్రిల్ 19న మహేష్ బాబు బాధ్యతలు తీసుకోబోతున్నారంటూ క్యాప్షన్ జత చేశారు. దీంతో ఈ మూవీ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.

కాగా, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కియారా అద్వానీ(Kiara Advani) హీరోయిన్‌గా నటించింది. దీనిని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్(DVV Entertainments) బ్యానర్‌పై డీవీవీ దానయ్య(DVV Danayya) నిర్మించారు. అయితే దేవి శ్రీ ప్రసాద్(Devi Sri Prasad) సంగీతం అందించిన ఈ చిత్రం 2018లో విడుదలై హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు మరోసారి థియేటర్స్‌లోకి రాబోతుండటం విశేషం.ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘SSMB-29’. ఈ చిత్రానికి దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra)హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలు కాకుండానే పలు వార్తలు వైరల్ అవుతూ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేస్తున్నాయి. ఇక ఈ మూవీ కోసం ఆయన కూడా చాలా కష్టం పడుతుండటం విశేషం. దీంతో గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటున్నారు.

Next Story

Most Viewed