- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వింతైన స్టార్-నోస్డ్ జంతువు.. చూస్తే అవాక్కవ్వాల్సిందే
దిశ, ఫీచర్స్ : భూమిపై అరుదుగా కనిపించే పలు వింత జీవుల విచిత్ర శరీరాకృతి ఒక్కోసారి ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంటాయి. ఇలాంటి అనేక విచిత్ర జీవుల వీడియోలు, ఫొటోలు నెట్టింట తరచూ హల్ చల్ చేస్తుండగా.. రీసెంట్‌గా ఓ వింత జంతువుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
స్టార్-నోస్డ్ మోల్‌గా పిలవబడే ఈ జంతువు ఆక్టోపస్ మాదిరిగా తల, చిన్న కళ్లు, నక్షత్రం వలె కనిపించే ముక్కును కలిగి ఉంది. దీనికి గల 25వేల మినట్ సెన్సార్ రెసిప్టార్స్ దాని చుట్టూ ఉన్న మార్గాన్ని కనుగొనడంలో సాయపడతాయి. అంతేకాదు ఈ జీవి ఎక్కువగా భూగర్భ సొరంగాలు తవ్వడానికి తన పొడవైన పంజాలను ఉపయోగిస్తుంది. దాదాపు అంధత్వ లక్షణాలు గల ఈ జీవికి సెకనులో పావు వంతులోనే దాని ఎరను గుల్ల చేయగల సామర్థ్యం ఉంది. అందువల్లే ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా తినే జీవిగా పేరు పొందింది. ఇక ప్రత్యేకంగా కనిపించే ఈ జీవులు గొప్ప వేటగాళ్లు. వానపాములు, నత్తలు, చిన్న చిన్న ఉభయచరాలు, చేపలు వంటి ఆహారాన్ని ఇవి చాలా స్పీడ్‌గా గుర్తిస్తాయి. అంతేకాదు మంచు అడుగున ఈదడంలోనూ ఈ జీవులు నేర్పరులు.
The Star-nosed mole has 22 tentacles surrounding its nose, heightening its sense of touch.
— Weird Animals (@Weird_AnimaIs) July 8, 2021
(Photos Kenneth Catania) pic.twitter.com/3XVwVIvHc6