- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టాటూస్‌తో 'బ్లాక్ ఏలియన్'గా మారిన వ్యక్తి..
దిశ, ఫీచర్స్ : ఒక్కొక్కరికి ఒక్కో వ్యాపకం ఉంటుంది. కాలక్రమేణా ఆ వ్యాపకం కాస్త వ్యసనంలా తయారై నిత్యం ప్రేరేపిస్తుంటుంది. ఇలాంటి పిచ్చి వ్యసనంతో కొందరు తమ రూపాన్ని మార్చుకునేందుకు విపరీతంగా డబ్బు ఖర్చు చేస్తుంటారు. శారీరకంగా కలిగే నష్టాలను కూడా అనుభవించేందుకు సిద్ధపడతారు. తీరా చూస్తే చివరకు ఆ ప్రయోగాలన్నీ వికటించి.. వారి పరిస్థితి రెండిటికీ చెడ్డ రేవడిలా తయారవుతుంది. ప్రస్తుతం ఇదే కోవకు చెందిన ఒక వ్యక్తి తన బాడీ మొత్తం టాటూస్ వేసుకుని 'బ్లాక్ ఏలియన్'గా మారిపోయాడు. అంతవరకు బాగానే ఉన్నా ఈ ఆహార్యంతో ఎక్కడా ఉద్యోగం పొందలేక బాధపడుతున్నాడు.
ఆంథోనీ లోఫ్రెడో.. 'బ్లాక్ ఏలియన్'గా రూపాంతరం చెందాలనుకున్నాడు. ఈ క్రమంలోనే కనుబొమ్మలతో పాటు శరీరంలోని ప్రతీ భాగాన్ని టాటూస్‌తో కప్పేశాడు. తల, చేతులు, చర్మం కింద ఇంప్లాంట్లు అమర్చుకున్నాడు. అంతేకాదు అతని రెండు వేళ్లు, ముక్కు, చెవులు కూడా కట్ చేయబడ్డాయి. ఫోర్క్‌డ్ ఎఫెక్ట్ క్రియేట్ చేసేందుకు నాలుకను మధ్యలోకి స్ల్పిట్ చేసుకున్నాడు.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం తన పరిస్థితి వివరించిన లోఫ్రెడ్.. ఈ రూపానికి చాలా నెగెటివ్ స్పందన ఉందని ఒప్పుకున్నాడు. వీధిలో ఉండేవారే కాక కాబోయే యజమానులు కూడా తనని జడ్జ్ చేసేవారని పేర్కొన్నాడు. 'ఇది టాటూ మాత్రమే కాదు. అంతకంటే ఎక్కువ. ప్రతిరోజు కొత్తకొత్త వ్యక్తులతో నెగెటివ్‌గా విమర్శించబడతాను. ఈ జీవితంలో ప్రతీ ఒక్కరు ప్రతీది అర్థం చేసుకోలేరు. నేను పిచ్చివాడినని కొందరు అనుకుంటున్నారు. నన్ను చూసినపుడు అరుస్తూ పరుగులు తీస్తున్నారు. అందువల్ల నాకు రాత్రిపూట ఎవరైనా కనిపిస్తే వారిని నుంచి తప్పించుకుని వెళ్లిపోతాను' అంటూ తెలియజేశాడు.