- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పార్క్ చేసిన బైక్ కోసం వెళ్లి.. మృత్యువు ఒడిలోకి
దిశ, పటాన్చెరు: డ్రైనేజ్ కాలువలో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ ప్రసాద్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 02 రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో ముత్తంగి గ్రామానికి చెందిన భూషణ్ రెడ్డి తన భార్యతో, తన స్నేహితులు మహేష్ గౌడ్, శిరీష్ రెడ్డి లను కలవడానికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుండి వెళ్ళాడు. బైక్ భారత్ పెట్రోల్ బంక్ వద్ద పార్క్ చేసి, ముగ్గురు కలిసి మహేష్ గౌడ్ బైక్ పైన నవ పాన్ చౌరస్తా దగ్గరలో వైన్ షాప్ లో మందు తీసుకున్నారు.
ముగ్గురు మందు తాగి తిరిగి ముత్తంగి వెళ్లేందుకు బైక్ మీద వెళ్తూ మహేష్ గౌడ్ ను భూషణ్ రెడ్డి, శిరీష్ రెడ్డి లు తన ఇంటి వద్ద దించారు. రాత్రి 11 గంటల సమయంలో శిరీష్ రెడ్డి, భూషణ్ రెడ్డి లు రోడ్డు దాటుకొని భారత్ పెట్రోల్ బంక్ దగ్గర బైక్ గురించి వెళ్లారు. భూషణ్ రెడ్డి పెట్రోల్ బంక్ పక్కన ఖాళీ స్థలంలో మూత్రవిసర్జనకు వెళ్లగా శిరీష్ రెడ్డి బైక్ తీసుకురావడానికి వెళ్లగా భూషణ్ రెడ్డి మద్యం మత్తులో మూత్రవిసర్జన చేస్తూ ప్రమాదవశాత్తు పెట్రోల్ బంక్ పక్కన గల పొదలో ఉన్న డ్రైనేజీ కాలువలో బోర్లా పడి తలకు గాయమై ఊపిరాడక చనిపోయాడు.
ఈ ఘటన చూసుకోకుండా శిరీష్ రెడ్డి తన బైక్ తీసుకొని ఇంటికి వెళ్లిపోయాడు. ఆదివారం భారత్ పెట్రోల్ బంక్ లోపల సీసీ కెమెరాలు చెక్ చేస్తుండగా ఈ విషయం తెలిసింది. మృతునికి భార్య శ్వేత, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. మృతుడు కారు డ్రైవింగ్ చేస్తూ జీవనం సాగిస్తుండేవాడు. మృతుని చిన్నాన్న రఘుపతి రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.