- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెలవు కారణంగా తండ్రితో కలిసి వెళ్లిన విద్యార్థిని.. అంతలోనే దారుణం
దిశ ప్రతినిధి, వైరా : తల్లాడ రాజమండ్రి రాష్ట్ర రహదారిపై అంజనాపురం గ్రామ సమీపంలోని ఆంజనేయస్వామి దేవాలయం ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థిని మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్న రామకృష్ణ ఓ ఆటో డ్రైవర్. అతని కుమార్తె చిన్న పూజ కల్లూరులోని గురుకుల వసతి గృహంలో ఉంటూ తొమ్మిదో తరగతి చదువుకుంటుంది.
ఆదివారం సెలవు కావడంతో పూజను రామకృష్ణ ఇంటికి తీసుకొస్తున్న క్రమంలో చింతకాని మండలానికి చెందిన నున్నలక్ష్మి, నున్న మేఘన అదే ఆటోలో ఎక్కారు. అంజనాపురం ఆంజనేయ స్వామి దేవాలయం వరకు వారి ప్రయాణం సజావుగా సాగింది. అయితే దేవాలయం వద్ద ఎదురుగా వస్తున్న సిమెంట్ లోడుతో వస్తున్న లారీ డ్రైవర్ మద్యం మత్తులో, అతివేగం వల్ల ఆటోను ఢీ కొన్నాడు. ఈ ప్రమాదంలో చిన్న పూజ అక్కడికక్కడే మరణిచింది. రామకృష్ణ తలకు తీవ్ర గాయాలయ్యాయి. లక్ష్మి, మేఘనకు కూడా గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను 108 ద్వారా ఖమ్మం హాస్పిటల్‌కు తరలించారు. విషయం తెలుసుకొని ఘటనాస్థలానికి చేరుకున్న తల్లాడ ఎస్ఐ పి. సురేష్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.