ఆ మంత్రి నుంచి ప్రాణహాని ఉంది.. హెచ్ఆర్సీని ఆశ్రయించిన కుటుంబం

by Javid Pasha |   ( Updated:2022-04-06 16:52:59.0  )
ఆ మంత్రి నుంచి ప్రాణహాని ఉంది.. హెచ్ఆర్సీని ఆశ్రయించిన కుటుంబం
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్: రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి నుండి ప్రాణహాని ఉంది రక్షణ కల్పించండి అని ఓ కుటుంబం బుధవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేసింది. సూర్యాపేట జిల్లాలోని ఎర్కారం గ్రామానికి చెందిన వడ్డే యాదమ్మ హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్‌తో కలిసి హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. సూర్యాపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న తన భర్త యల్లయ్యపై ఉన్న రాజకీయ కక్షలతో మంత్రి జగదీశ్ రెడ్డి పోలీసులతో అక్రమ కేసులు, పీడీయాక్ట్ పెట్టించి జైలు పాలు చేశారని తెలిపారు. జైలు నుండి విడుదలైన తర్వాత కూడా మంత్రి అండతో ఆయన అనుచరులు తన భర్తపై హత్యాయత్నం కూడా చేశారని చెప్పారు.

సూర్యాపేట ఎస్పీ, డీఎస్పీలు మంత్రి ఆదేశాల మేరకు హత్యాయత్నం జరిగినా పట్టించుకోలేదని, తన భర్త యల్లయ్యపై అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేశారని వాపోయారు. టీఆర్ఎస్ పార్టీలో చేరనందుకే రాజకీయ కక్షతో మంత్రి తమ కుటుంబాన్ని నిత్యం వేధిస్తున్నారని అన్నారు. తమ కుటుంబానికి మంత్రి జగదీశ్ రెడ్డి, ఆయన అనుచరుడు వట్టే జానయ్యల నుండి ప్రాణ హాని ఉందని, వారి నుండి తమకు రక్షణ కల్పించేలా జిల్లా పోలీసులను ఆదేశించాలని వారు హెచ్ఆర్‌సీని కోరారు.

Advertisement

Next Story

Most Viewed